
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
పాయకాపురం(విజయవాడరూరల్): నున్న గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు నున్న వీఆర్వో పేకేటి ప్రకాష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నున్న గ్రామంలో పలతిప్ప సమీపంలో సాగర్ కాల్వకు కుడి వైపు భీమవరపు రాధిక మామిడి తోటలో గుర్తు తెలియని వ్యక్తి చనిపోయి ఉన్నట్లు స్థానికులు గుర్తించారన్నారు. మృతుడు ఫుల్ డ్రాయర్ కలిగి, కుడి చేతిపై భాగం కుళ్లి పోయింది. ఎడమ చేయిపై డీఎస్ అను అక్షరాల పచ్చబొట్టు ఉన్నాయి. 5.5 అడుగుల ఎత్తు, ఎరుపు రంగులో సన్నగా ఉన్నాడు. ఇతర వివరాలు తెలియరాలేదు. వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇసుక ట్రాక్టర్, పొక్లెయినర్ స్వాధీనం
పెనమలూరు: చోడవరం గ్రామ పరిధి కృష్ణానదిలో ఇసుక అక్రమంగా తవ్వుతున్న టీడీపీ నాయకుడి ట్రాక్టర్, పొక్లెయినర్‌లను గనుల శాఖ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. చోడవరం ఇసుక క్వారీలో ఇసుక తవ్వకాలపై కలెక్టర్ నిషేధం విధించారు. అయితే ఇసుక అక్రమంగా తవ్వుతున్నారన్న సమాచారంతో గనుల శాఖ, రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించి వాహనాలను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. అధికారులు ట్రాక్టర్‌ను సీజ్ చేయగా ఇసుక లోడ్ అవని పలు ట్రాక్టర్లను వదిలేశారు.

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం