
40 బారికేడ్లు వితరణ
జి.కొండూరు: రోడ్డు ప్రమాదాల నివారణకు నాగార్జున సిమెంట్ కంపెనీ నుంచి రూ.3 లక్షల విలువైన 40 ఐరన్ బారికేడ్లను జి.కొండూరు పోలీసులకు కంపెనీ ప్రతినిధులు మంగళవారం అందజేశారు. ఈ బారికేడ్లను 30వ నంబర్ జాతీయ రహదారిపై వేగ నియంత్రణ కోసం వినియోగించనున్నట్లు ఎస్‌ఐ సతీష్‌కుమార్ తెలిపారు. కార్యక్రమంలో సిమెంట్ కంపెనీ టెక్నికల్ హెడ్ ఆర్‌ఎస్‌ఎన్ రాజు, హెచ్‌ఆర్ హెడ్ ఎంఎస్ అజహర్ పాల్గొన్నారు.
పాఠశాలలో
పాము కలకలం
పెనుగంచిప్రోలు: స్థానిక కేవీఆర్ జెడ్పీ హైస్కూల్‌లో పాము కలకలం సృష్టించింది. హైస్కూల్ క్రీడా మైదానంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో విద్యార్థులకు పాము కనపడటంతో కర్రలు, రాళ్లతో కొట్టి చంపారు. అనంతరం పాముతో విద్యార్థులు కొందరు స్కిప్పింగ్ ఆడుతూ, మెడలో వేసుకుని విన్యాసాలు చేశారు. ఆ సమయంలో ఏఒక్క ఉపాధ్యాయుడు కూడా పర్యవేక్షణ లేకపోవటంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏమైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు అని వాపోతున్నారు.
వైభవంగా కుంభాభిషేక మహోత్సవాలు
విజయవాడకల్చరల్: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పున్నమ్మతోటలోని టీటీడీ దేవస్థానంలో 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే మహాకుంభాభిషేక అష్టబంధన, మహాసంప్రోక్షణ కార్యక్రమాలు కనులపండువగా సాగుతున్నాయి. మంగళవారం నాటి కార్యక్రమంలో సర్వశాంతి హోమం, సహస్రాహుతి హోమం నిర్వహించారు. వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం నిర్వహించిన యాగ క్రతువును వైఖానస పండితులు మురళీకృష్ణ అయ్యంగార్, వేదాంతం శశికిరణ్, టీటీడీ ఆగమ శాస్త్ర పండితులు నిర్వహించారు. టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు లలితా రమాదేవి, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.
రైల్వే సిగ్నల్ కంట్రోల్
కార్యాలయం ప్రారంభం
దుగ్గిరాల: నూతన కార్యాలయంలో రైల్వే సిగ్నల్ కంట్రోల్ వ్యవస్థను రైల్వే ఉన్నతాధికారులు మంగళవారం ప్రారంభించారు. సుమారు మూడు సంవత్సరాలు నుంచి ఆధునీకరణ పనులు వాటితో పాటు 3వ లైను నిర్మాణ జరుగుతోంది. పనులు పూర్తి కావడంతో ఆధునిక సాంకేతిక విధానం కలిగిన కార్యాలయాన్ని ప్రారంభించారు.

40 బారికేడ్లు వితరణ

40 బారికేడ్లు వితరణ