
ఇంటర్ తరగతులపై క్షేత్రస్థాయి పరిశీలన
హనుమాన్‌జంక్షన్ రూరల్: స్థానిక నూజివీడు రోడ్డులోని బాపులపాడు జెడ్పీ హైస్కూల్‌ను పాఠశాల విద్య కమిషనర్ వి.విజయరామ రాజు, ఇంటర్మీడియెట్ విద్య డైరెక్టర్ కృతికా శుక్లా బుధవారం సందర్శించారు. హైస్కూల్ ప్లస్ పేరిట నిర్వహిస్తున్న ఇంటర్మీడియెట్ తరగతుల బాధ్యతను పాఠశాల విద్య శాఖ నుంచి ఇంటర్మీడియెట్ బోర్డుకు బదిలీ చేసేందుకు క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు. బాపులపాడు జెడ్పీ హైస్కూల్‌లో ఇంటర్మీడియెట్ అభ్యసిస్తున్న విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించారు. పలు సబ్జెక్టులకు జూనియర్ లెక్చర్లర్లు లేకపోవటంతో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు తెలిపారు. అనంతరం ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం వీరవల్లి లోని జెడ్పీ హైస్కూల్ ప్లస్‌ను కూడా ఇంటర్మీడియెట్ విద్య డైరెక్టర్ కృతికా శుక్లా సందర్శించారు.