
అసంపూర్తి పనులపై అసంతృప్తి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల తీరుపై దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మాస్టర్ ప్లాన్‌లో భాగంగా చేపట్టిన పలు అభివృద్ధి పనులు, దాతల సహకారంతో నిర్మించిన యాగశాలను బుధవారం ఆయన పరిశీలించారు. తొలుత కనకదుర్గనగర్‌కు చేరుకున్న రామచంద్రమోహన్, ఆలయ ఈవో శీనానాయక్, దేవస్థానం ఇంజినీరింగ్ అధికారులు వెలివేటెడ్ క్యూకాంప్లెక్స్‌ను పరిశీలించారు. మాస్టర్ ప్లాన్‌లో చూపిన విధంగా నిర్మాణాలు జరుగుతున్నాయా అని ఇంజినీరింగ్ అధికారులను ప్రశ్నించారు. అనంతరం మహా మండపం వద్ద నిర్మిస్తున్న అన్నదాన, ప్రసాదాల పోటు పనులను పరిశీలించారు.
ఇంజినీరింగ్ పనుల్లో
అర్చకుల జోక్యం తగదు
ఆలయ ప్రాంగణంలో దాతల సహకారంతో నిర్మించిన యాగశాలను కమిషనర్ పరిశీలించారు. యాగశాల పక్కనే నిర్మిస్తున్న పూజా మండపాల పనులను పరిశీలించారు. ఆలయ నిర్మాణాలు, అభివృద్ధి పనుల్లో కొంతమంది అర్చకులు జోక్యం చేసుకుంటున్నారని, ఇంజినీరింగ్ పనులలో వారి సలహాలు అవసరం లేదని, ఎవరి పనులు వారు చేసుకుంటే బాగుంటుందని సున్నితంగా మందలించారు. ఆలయంలో జరుగుతున్న పనులు సకాలంలో పూర్తి చేసేలా కాంట్రాక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని ఈవో శీనానాయక్‌కు సూచించారు. మహా మండపం 7వ అంతస్తులోని చైర్మన్ చాంబర్‌లో దేవదాయ శాఖ ఇంజినీరింగ్ అధికారులు, దుర్గగుడి ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దసరా నాటికి పనులు పూర్తి చేయాలని సూచించారు.
దుర్గమ్మ సన్నిధిలో అభివృద్ధి పనులను పరిశీలించిన దేవదాయ శాఖ కమిషనర్