బాధితులకు న్యాయం చేస్తాం | - | Sakshi
Sakshi News home page

బాధితులకు న్యాయం చేస్తాం

Jul 29 2025 10:36 AM | Updated on Jul 29 2025 10:36 AM

బాధితులకు న్యాయం చేస్తాం

బాధితులకు న్యాయం చేస్తాం

‘మీ కోసం’లో కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు

కోనేరుసెంటర్‌: న్యాయం కోసం ఎదురుచూసే బాధితులు పోలీసులను ఆశ్రయించేందుకు ధైర్యంగా ముందుకురావాలని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్‌. గంగాధరరావు పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని స్పందన హాలులో జరిగిన మీ కోసంలో పాల్గొన్న ఆయన జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి అర్జీలు అందుకున్నారు. వారి సమస్యలను సామరస్యంగా ఆలకించారు. కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. మరికొన్ని అర్జీలను సంబంధిత అధికారులకు సిఫార్సు చేసి వెంటనే వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ సమస్య ఏదైనా బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. మొత్తం 38 అర్జీలు అందినట్లు ఎస్పీ తెలిపారు.

వచ్చిన అర్జీల్లో కొన్ని..

●బందరు మండలం వాడగొయ్యి నుంచి పద్మా అనే వివాహిత ఎస్పీ వద్దకు వచ్చి.. అత్తింటి వారితో కలిసి భర్త తనను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడని, రక్షణ కల్పించాలని విన్నవించారు.

●తోట్లవల్లూరు నుంచి బ్రహ్మాజీ అనే వ్యక్తి తమ బంధువులు తన వ్యవసాయ భూమిని అన్యాయంగా ఆక్రమించి కాజేయాలని చూస్తున్నారని, అడ్డుపడుతున్న తనపై భౌతికదాడికి దిగి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోయాడు. వారిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరాడు.

●కూచిపూడి నుంచి వచ్చిన మురళి అనే యువకుడు తనకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తన స్నేహితుడు పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నాడని, సంవత్సరం గడిచినప్పటికీ ఉద్యోగం ఇప్పించకపోగా.. డబ్బులు అడుగుతుంటే తన పట్ల దుర్భాషలాడుతూ అవమానిస్తున్నాడంటూ వాపోయాడు. అతనిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement