గుండెపోటు, బ్రెయిన్‌ స్ట్రోక్‌తో ఇద్దరు మృతి | - | Sakshi
Sakshi News home page

గుండెపోటు, బ్రెయిన్‌ స్ట్రోక్‌తో ఇద్దరు మృతి

Sep 21 2026 12:26 AM | Updated on Sep 21 2026 12:26 AM

రఘునాథపాలెం: మండలంలో వేర్వేరు గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఆదివారం గుండెపోటు, బ్రెయిన్‌ స్ట్రోక్‌తో మృతిచెందారు. వివరాలిలా.. వి.వెంకటాయపాలెం గ్రామానికి చెందిన కిలారు రామారావు(67) శనివా రం అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు ఖమ్మంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి చెందారు. రామారావుకు భార్య భార్గవి, కుమారుడు, కుమార్తె ఉన్నారు.భార్గవి రిటైర్డ్‌ ఉపాధ్యాయురాలు కాగా, వారి పిల్లలు విదేశాల్లో నివాసముంటున్నారు. రామారావు గతంలో వి.వెంకటాయపాలెం యూత్‌ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. అదేవిధంగా రాంక్యాతండాకు చెందిన జాటోత్‌ నవ్య (21) ఆదివారం బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురైంది. దీంతో కుటుంబసభ్యులు ఖమ్మంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందింది. నవ్యకు భర్త, కుమార్తె ఉన్నారు. నవ్యకు భర్తతో గత రెండునెలల క్రితం విడాకులు కావడంతో తండ్రి వద్ద ఉంటుందని గ్రామస్తులు తెలిపారు.

చెరుకు తోటలో కణుజు..

నీటి కోసం వచ్చి కొమ్ములు ఇరుక్కుని కన్నుమూత

కల్లూరురూరల్‌: మండలంలోని లక్ష్మీపురం(రాళ్లబంజరు) గ్రామ సమీపాన చెరుకు తోటలో కణుజు మృతదేహా న్ని గుర్తించారు. చెరుకు తోటకు నీరు పెట్టేందుకు ఆది వారం ఉదయం వెళ్లిన రైతు భూక్యా రవి అక్కడ కణుజు మృతదేహాన్ని చూసి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ ఏ.లక్ష్మి, డీఆర్‌ఓ సురేష్‌ చేరుకుని వెటర్నరీ డాక్టర్‌ మమతఆధ్వర్యాన పోస్టుమార్టం నిర్వహించారు. కాగా, లక్ష్మీపురం గ్రామ సమీపంలోఉన్న అటవీ ప్రాంతం నుంచి నీటి కోసం కణుజు వచ్చిందని భావిస్తున్నారు. ఈక్రమాన కొమ్ములు చెరుకు తోటలో ఇరుక్కుపోయి బయటరాలేక.. అప్పటికే దాహంతో ఉండడం వల్ల మృతి చెందినట్లు భావిస్తున్నారు.

ట్రావెల్స్‌ బస్సులో మంటలు..

కొణిజర్ల: ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో డ్రైవర్‌ అప్రమత్తతతో ప్రమాదం తప్పినట్లయింది. ప్రయాణికులు, బస్సు డ్రైవర్‌ నారాయణ స్వామి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని వైజాగ్‌కు చెందిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఆదివారం రాత్రి సుమారు 45 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌ నుంచి శ్రీకాకుళం జిల్లా పలాస వెళ్తోంది. ఈక్రమాన కొణిజర్ల మండలం పల్లిపాడు పెట్రోల్‌ బంక్‌ సమీపంలోకి రాగానే ఒక్క సారిగా ఇంజన్‌లో మంటలు చెలరేగగా.. డ్రైవర్‌ అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కన ఆపి మంటలార్పే యంత్రంతో మంటలు ఆర్పి వేశాడు. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement