బ్రెయిన్‌ స్ట్రోక్‌తో యువతి మృతి | Young woman dies of brain stroke | Sakshi
Sakshi News home page

బ్రెయిన్‌ స్ట్రోక్‌తో యువతి మృతి

Sep 21 2026 2:28 PM | Updated on Sep 21 2026 2:41 PM

Young woman dies of brain stroke

ఖమ్మం: మండలంలో వేర్వేరు గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఆదివారం గుండెపోటు, బ్రెయిన్‌ స్ట్రోక్‌తో మృతిచెందారు. వివరాలిలా.. వి.వెంకటాయపాలెం గ్రామానికి చెందిన కిలారు రామారావు(67) శనివా రం అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు ఖమ్మంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి చెందారు. రామారావుకు భార్య భార్గవి, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

భార్గవి రిటైర్డ్‌ ఉపాధ్యాయురాలు కాగా, వారి పిల్లలు విదేశాల్లో నివాసముంటున్నారు. రామారావు గతంలో వి.వెంకటాయపాలెం యూత్‌ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. అదేవిధంగా రాంక్యాతండాకు చెందిన జాటోత్‌ నవ్య (21) ఆదివారం బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురైంది. దీంతో కుటుంబసభ్యులు ఖమ్మంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందింది. నవ్యకు భర్త, కుమార్తె ఉన్నారు. నవ్యకు భర్తతో గత రెండునెలల క్రితం విడాకులు కావడంతో తండ్రి వద్ద ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. 

ఇదీ చదవండి: లగ్జరీ కారులో మంటలు చెలరేగడంపై పోలీసుల ఆరా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement