ఖమ్మం సహకారనగర్: విద్యార్థుల్లో నైపుణ్యాలు, స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ (బీఆర్‌ఏఓయూ)లో ఆధునిక అవసరాలకు అనుగుణంగా నూతన కోర్సులు, విద్యా విధానాల ను అమలు చేస్తోందని యూనివర్సిటీ ఎడ్యుకేషనల్ ఎక్స్‌టెన్షన్ సెంటర్ నోడల్ అధికారి డాక్టర్ బి.ధర్మనాయక్ తెలిపారు. ఆదివారం నగరంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాలలోని కేంద్రంలోని కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2026 విద్యా సంవత్సరానికి యూజీ, పీజీ,డిప్లొమా, సర్టిఫికెట్ తది తర కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 30లోగా దరఖా స్తు చేసుకోవాలన్నారు. ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ విధానంలో ఉందని, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి ఆధ్వర్యంలో మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన కోర్సులు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ‘‘మీ ఆలో చనను వ్యాపారంగా మార్చండి.. మేము మీకు సహాయం చేస్తాము’’అనే నినాదంతో రూపొందించిన ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థినులకు వ్యాపారాభివృద్ధి, ఆవిష్కరణలు, నైపుణ్య శిక్షణ, మార్గదర్శకత్వం అందించనున్నామన్నారు. ఈ సమావేశంలో రీజిన ల్ కో–ఆర్డినేటర్ డాక్టర్ ఎ.వీరన్న, జిల్లాలోని అధ్యయన కేంద్రాల కౌన్సిలర్లు, జాక్ట్‌లు, సీనియర్ కౌన్సి లర్లు ధనమూర్తి, రమేష్, రఫీ, నాగేశ్వరరావు, సర్వేశ్వరరావు, ఆంజనేయులు, వినోద్‌కుమార్, రవివర్ధన్, రాణి ముఖేష్, గాంధీ పాల్గొన్నారు.
ఈ నెల 30 వరకు ప్రవేశాల గడువు


