విద్యారంగ సమస్యలపై రాజీలేని పోరాటాలు | - | Sakshi
Sakshi News home page

విద్యారంగ సమస్యలపై రాజీలేని పోరాటాలు

Sep 21 2026 12:26 AM | Updated on Sep 21 2026 12:26 AM

● ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి రామకృష్ణ ● జిల్లా నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా లక్ష్మణ్‌, మనోజ్‌

● ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి రామకృష్ణ ● జిల్లా నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా లక్ష్మణ్‌, మనోజ్‌

ఖమ్మంమయూరిసెంటర్‌: విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారంతో పాటు శాసీ్త్రయ విద్యా విధానం అమలయ్యే వరకు రాజీలేని పోరా టాలు నిర్వహిస్తామని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇటికాల రామకృష్ణ వెల్లడించారు. ఖమ్మంలోని గిరిప్రసాద్‌ భవనంలో నిర్వహించిన సంఘం జిల్లా నూతన సమితి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలో విద్యారంగం తీవ్ర సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురాకపోగా, ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. కార్పొరేట్‌, ప్రైవేట్‌ సంస్థలకు కొమ్ముకాస్తూ విద్యను వ్యాపారీకరించి, కాషాయీకరణకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేటి కాలంలో విద్వేషాలు, చాందసవాదాన్ని విద్యార్థుల పసి మెదళ్లలో నూరిపోసేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రయత్నిస్తున్నాయని దుయ్యబట్టారు. ఈ కుట్రలను తిప్పికొడుతూ శాసీ్త్రయ విద్యా విధా నం కోసం విద్యార్థి లోకం ఐక్యంగా పోరాడాలని రామకృష్ణ పిలుపునిచ్చారు.

నూతన కమిటీ ఎన్నిక..

ఖమ్మంలో నిర్వహించిన సంఘం 27వ మహాసభల సందర్భంగా జిల్లా నూతన సమితిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రామకృష్ణ తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా మడుపల్లి లక్ష్మణ్‌, జిల్లా కార్యదర్శిగా బూర మనోజ్‌ను ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే, 16 మంది ఆఫీస్‌ బేరర్లు, మొత్తం 51 మందితో కూడిన నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చెన్నంశెట్టి ఆకాష్‌, ఉపాధ్యక్షులు శివ నాయక్‌, అభిరామి రెడ్డి, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement