ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మంలో ఏర్పాటు చేసిన విన్ విజన్ కంటి ఆస్పత్రిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం ప్రారంభించారు. మాజీ ఎంపీ రామసహాయం సురేందర్‌రెడ్డి, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డితో కలిసి ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి వారి మన్నలను పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ నాయకులు సాధు రమేష్‌రెడ్డి, నాగళ్ల దీపక్ చౌదరి, తదితరులు పాల్గొన్నారు.


