మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ | - | Sakshi
Sakshi News home page

మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ

Sep 24 2026 2:06 AM | Updated on Sep 24 2026 2:06 AM

సాక్షి,బళ్లారి: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ బుడా అధ్యక్షుడు నారా ప్రతాప్‌రెడ్డి, ఆయన సతీమణి నారా శైలజారెడ్డి మాజీ ప్రధాని హెచ్‌.డీ దేవేగౌడను కలిశారు. బుధవారం బెంగళూరులోని మాజీ ప్రధాని దేవెగౌడ నివాసానికి వెళ్లి ఆయనతో కాసేపు ముచ్చటించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాజీ ప్రధానితో తమకు ఉన్న అనుబంధాన్ని వివరించారు. రాష్ట్రంతో పాటు దేశ రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తుల్లో ఈయన ఒకరని, గొప్ప మేధావి, రైతు నాయకుడని గుర్తు చేసుకున్నారు.

పౌర కార్మికుల సేవలు భేష్‌

సాక్షి,బళ్లారి/బళ్లారి టౌన్‌: నగర స్వచ్ఛతను కాపాడటంలో పౌర కార్మికుల కృషి, సేవలు వర్ణించలేనివని జిల్లాధికారి నాగేంద్ర ప్రసాద్‌ పేర్కొన్నారు. ఆయన బుధవారం పౌర కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని వాల్మీకి భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పౌరకార్మికుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారానికి నగర, స్థానిక సంస్థల అధికారులు బాధ్యతాయుతంగా ముందుండి పని చేయాలని సూచించారు. ప్రజలు చెత్తను ఎక్కడబడితే అక్కడ వేయకూడదన్నారు. ఇంటి ముంగిటకు చెత్త సేకరణ వాహనం వచ్చినప్పుడు చెత్తను వేయాలన్నారు. పౌర కార్మికుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారానికి నగరసభ, స్థానిక సంస్థల అధికారులు చిత్తశుద్దితో పని చేయాలన్నారు. పౌర కార్మికులు రిటైర్డ్‌ అయిన రోజునే పింఛన్‌ మినహా ఇతర అన్ని సదుపాయాలను కల్పించాలని కమిషనర్‌కు సూచించారు. నగర కమిషనర్‌ మంజునాథ్‌, ఆరోగ్య స్థాయి సమితి అధ్యక్షుడు వివేక్‌, జెడ్పీ సీఈఓ మహమ్మద్‌ హ్యారీష్‌ సుమేరా, పాలికె ఉప మేయర్‌ మొబీనా, పాలికె కమిషనర్‌ మంజునాథ్‌, కార్పొరేటర్లు నందీష్‌, పీ.వివేక్‌, కే.హనుమంతప్ప, కుబేర, నాగరత్న తదితరులు పాల్గొన్నారు.

జిల్లాధికారి నిషేధాజ్ఞల కొట్టివేత

బళ్లారిటౌన్‌: తాలూకాలోని కొళగల్లు గ్రామంలో శ్రీ ఎర్రితాత పుణ్యారాధన ప్రవచనాలను ఈ నెల 23 నుంచి అక్టోబర్‌ 3 వరకు నిర్వహించాల్సి ఉండగా, గ్రామంలో ఆలయ విషయంపై నెలకొన్న వివాదంతో పుణ్యారాధన జరపరాదని జిల్లాధికారి నాగేంద్ర ప్రసాద్‌ నిషేధాజ్ఞల ఆదేశాలను జారీ చేసిన సంగతి విదితమే. దీనిపై స్థానిక ఆలయం అధ్యక్షుడు ముత్తప్ప ధార్వాడ హైకోర్టును ఆశ్రయించారు. పూర్వాపరాలను విన్న జస్టిస్‌ ఎంవీఎస్‌ కమల్‌ మంగళవారం జిల్లాధికారి ఆదేశాలను రద్దు చేశారు. అంతేగాక పుణ్యారాధన నిర్వహిస్తే శాంతి భద్రతలకు ముప్పు వస్తుందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని ఈ నెల 18న ఎస్పీ ప్రస్తావించిన నివేదికలో కూడా వివరాలు లేవని డిప్యూటీ కమిషనర్‌ ముందు హామీ పత్రం ఇవ్వాలని పుణ్యారాధన సమయంలో శాంతి భద్రతలను పాటిస్తామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బాధ్యతలు తీసుకుంటామని, భక్తుల సంఖ్యకు తగినట్లుగా భద్రత ఏర్పాట్ల వివరాలను కూడా పిటిషనర్‌ ఇవ్వాలన్నారు. అధికారులు కూడా తగిన భద్రత, రక్షణ ఏర్పాట్లు చేయాలని, ఒక వేళ ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే జిల్లా యంత్రాంగం చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చునని ఆదేశించారు. దీంతో ఆలయ పాలక మండలి పుణ్యారాధన కార్యక్రమాలను చేపట్టేందుకు సన్నద్ధమైనట్లు తెలిసింది.

మందుల వాడకంపై జాగృతి ర్యాలీ

బళ్లారి రూరల్‌ : బీఎంసీఆర్‌సీలోని ఫార్మకాలజీ విభాగం ఆధ్వర్యంలో బుధవారం ఫార్మకోవిజిలెన్స్‌ వారోత్సవాల్లో భాగంగా వైద్యులు, వైద్య, నర్సింగ్‌ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఔషధాలపై రోగులకు, సంబంధీకులకు అవగాహన కల్పించారు. గడువు ముగిసిన మందుల వాడకం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. వైద్యులు సూచించకుండా మందులు, మాత్రలు వాడరాదన్నారు. అవగాహన ర్యాలీ ఫార్మకాలజీ విభాగం నుంచి ప్రారంభమై ఆసుపత్రి వరకు సాగింది. ర్యాలీలో బీఎంసీఆర్‌సీ డీన్‌ అండ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మరిరాజ్‌ జీర్‌, ప్రిన్స్‌పాల్‌ డాక్టర్‌ మల్లికార్జున, ఎం.ఫార్మకాలజీ విభాగ హెచ్‌ఓడీ డాక్టర్‌ వై.విశ్వనాథ్‌, డాక్టర్‌ మురుగేశ్‌, డాక్టర్‌ ఉమేశ్‌, డాక్టర్‌ శోభ, డాక్టర్‌ విశ్వనాథ్‌, డాక్టర్‌ శకుంతల, డాక్టర్‌ వీణా, డాక్టర్‌ రూపవతి, డాక్టర్‌ జ్యోతి, డాక్టర్‌ బాణాపుర అంబిక తదితరులు పాల్గొన్నారు.

హత్య కేసుల దర్యాప్తును

సీఐడీకి అప్పగించరూ

రాయచూరు రూరల్‌: జిల్లాలో జరిగిన దళితుల హత్య కేసుల దర్యాప్తును సీఐడీకి అప్పగించాలని దళిత సంఘర్ష సమితి సంచాలకుడు ఎస్‌.మారెప్ప డిమాండ్‌ చేశారు. మంగళవారం బెంగళూరులో రాష్ట్ర హోం శాఖ మంత్రి ప్రియాంక్‌ ఖర్గే, రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి అజయ్‌సింగ్‌లను కలిసి మాట్లాడారు. పాత కక్షల నేపథ్యంలో దేవదుర్గ తాలూకా గబ్బూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హద్దినాళలో బీఎస్పీ, దళిత కార్యకర్త భూమానంద హత్య, కరడకల్‌లో రేణుక హత్య, సిరవార తాలూకా హొక్రాణిలో అశ్వినిని అత్యాచారం చేసి బావిలో పడేసిన ఘటనలో ప్రధాన నిందితులను అరెస్ట్‌ చేయాలని, ఈ కేసుల దర్యాప్తును సీఐడీకి అప్పగించాలన్నారు. మాజీ మంత్రి బోసురాజు, గ్రామీణ శాసన సభ్యుడు బసన గౌడ దద్దల్‌, రవీంద్ర నాథ్‌, విశ్వనాథ్‌, నరసింహులు, శివ కుమార్‌, బేరి, అంబన్న, హేమరాజ్‌లున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement