● పడుకున్నవారిపై లారీ వెళ్లి ఇద్దరు మృతి
దొడ్డబళ్లాపురం: ఫ్యాక్టరీకి రక్షణగా గేట్ ముందు పడుకున్న సెక్యూరిటీ గార్డుల ప్రాణాలకు భద్రత లేకుండా పోయింది. లారీ డ్రైవరు నిర్లక్ష్యం వల్ల ఇద్దరి ప్రాణాలు పోయాయి. ఈ విషాద ఘటన కలబుర్గి జిల్లా ఆళంద తాలూకా నాగలేగావ్ గ్రామం దగ్గర బ్లూఫైన్ పవర్ విండ్ కంపెనీ ముందు జరిగింది. గ్రామవాసులు సంతోష్ (45), సంగయ్యస్వామి (46) మృతులు. వీరిద్దరూ బుధవారం రాత్రి నైట్ డ్యూటీలో కంపెనీ గేట్ ముందు పడుకున్నారు. అర్ధరాత్రి అటుగా వచ్చిన లారీ ఒకటి వారిపైకి దూసుకెళ్లింది. ఇద్దరి శరీరాలు ఛిద్రమై ప్రాణాలు వదిలారు. డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తగిన పరిహారం అందించి న్యాయం చేయాలంటూ కుటుంబీకులు, స్థానికులు డిమాండ్ చేశారు.


