జనం ఓట్లు తీసేస్తున్నారు సర్‌ | - | Sakshi
Sakshi News home page

జనం ఓట్లు తీసేస్తున్నారు సర్‌

Sep 25 2026 2:23 AM | Updated on Sep 25 2026 2:23 AM

హొసపేటె: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియపై ఆందోళనలు వ్యక్తం చేస్తూ ప్రమఖ నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాష్‌రాజ్‌ ఆధ్వర్యంలో గురువారం హొసపేటె అక్కమహాదేవి ఫంక్షన్‌ హాల్‌లో సదస్సు నిర్వహించారు. ఆయన చేపట్టిన జాగృతి యాత్ర ఇక్కడకు చేరుకుంది. పౌర సంఘాలు, కొన్ని పార్టీల నాయకులు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పేరుతో అర్హులైన ఓటర్లను జాబితాల నుంచి తొలగిస్తున్నారని ప్రకాశ్‌రాజ్‌ ఆరోపించారు. ఓటర్ల జాబితా సవరణలో పారదర్శకత, జావాబుదారీతనం ఉండాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఓటు హక్కు ప్రతి పౌరుని రాజ్యాంగ హక్కు అని పేర్కొంటూ, ఓటర్ల జాబితాలో సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలు ఆధారాలను సేకరించి గొంతెత్తాలని ఆయన సూచించారు.

ఢిల్లీలో నిరసన నిర్వహిస్తా

ఇటీవల బెళగావి ఉత్తర నియోజకవర్గంలో కొన్ని పోలింగ్‌ కేంద్రాల పరిధిలో నకిలీ ఫారం–7ను అందజేసి ముస్లిం ఓటర్లను తొలగించారనే ఆరోపణలను ఆయన ప్రస్తావించారు. సర్‌పై రాష్ట్రంలో ఓటర్ల సమస్యలను సేకరించి సామాజిక ఆడిట్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. సెప్టెంబర్‌ 30 లోగా తాను సేకరించిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందించి, తరువాత ఢిల్లీలో ప్రజా నిరసన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఓటర్ల హక్కుల పరిరక్షణ కోసం ప్రజలు ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల వ్యవస్థ స్వతంత్రత, ఓటర్ల హక్కుల పరిరక్షణపై ప్రకాష్‌రాజ్‌తో పాటు పలువురు వక్తలు ప్రసంగించారు.

నటుడు, సామాజిక కార్యకర్త

ప్రకాష్‌రాజ్‌ ఆరోపణ

హొసపేటెలో జాగృతి సదస్సు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement