ఈసీ ద్వారా గెలుస్తోన్న బీజేపీ | - | Sakshi
Sakshi News home page

ఈసీ ద్వారా గెలుస్తోన్న బీజేపీ

Sep 25 2026 2:23 AM | Updated on Sep 25 2026 2:23 AM

శివాజీనగర్‌: కేంద్ర ఎన్నికల కమిషనర్ల మధ్య విభేదాలకు, సర్‌లోని లోపాలకు నైతికంగా బాధ్యత వహించి చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ (సీఈసీ) పదవికి రాజీనామా చేయాలని, సర్‌ను రద్దు చేసి కొత్తగా నిర్వహించాలని ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్‌ డిమాండ్‌ చేశారు. గురువారం సదాశివనగరలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ మొదటి నుంచి ఓట్ల రిగ్గింగ్‌కు వ్యతిరేకంగా బెంగళూరు నుంచి నిరసనను ప్రారంభించారన్నారు. భారతదేశం ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్య దేశం. కానీ ఇక్కడ బీజేపీ అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజల ఓటు హక్కును లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. కేంద్ర ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తి దుర్వినియోగమవుతోందన్నారు, ముగ్గురు కమిషనర్లలో ఇద్దరు, ప్రధాన కమిషనర్‌ అభిప్రాయానికి విరుద్ధంగా తమ వైఖరిని వ్యక్తం చేశారన్నారు. నిరక్షరాస్యులు, పేదలు, నిమ్న వర్గాల ఓటు హక్కును సర్‌ ద్వారా హరించడానికి కుట్ర జరుగుతోందన్నారు. ఎన్నికల సంఘాన్ని దుర్వినియోగం చేసి పశ్చిమ బెంగాల్‌, బీహార్‌, ఇతర ప్రాంతాల ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని ఆరోపించారు. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో కూడా అదే వ్యూహాన్ని అనుసరిస్తోందన్నారు. కర్ణాటక సర్‌ గడువును పొడిగించాలని ఈసీకి లేఖ రాశానని తెలిపారు.

కేపీఎస్‌సీపై...

శివాజీనగర: కేపీఎస్‌సీ సమస్యపై చట్టపరమైన నిబంధనలను పరిశీలిస్తాం. విద్యార్థులకు న్యాయం అందించడం, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సీఎం అన్నారు. కరువు నేపథ్యంలో రైతులకు సహాయానికి ప్రణాళిక రూపొందిస్తామన్నారు. గృహలక్ష్మీ పథకాన్ని మూసివేసి, సాగునీటి పథకాలకు ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే సురేష్‌గౌడ, ఇతరులు అన్నారు, దీనిని చాలా మంది వ్యతిరేకించారని తెలిపారు.

సర్‌ను రద్దు చేయాలి

ఈసీది అధికార దుర్వినియోగం: సీఎం డీకే

ముగిసిన అసెంబ్లీ

పశ్చిమ కనుమల పరిరక్షణపై కస్తూరిరంగన్‌ నివేదికను అమలు కోసం కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌, రాష్ట్రంలో తాండవిస్తున్న కరువు అంశాలపై నాలుగు రోజుల అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు గురువారంతో ముగిశాయి. నాలుగు రోజులూ చర్చ కంటే అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీజేపీ నాయకులు పరస్పర ఆరోపణలకే పెద్దపీట వేశారు. కస్తూరి రంగన్‌ నివేదికను యథాతథంగా అమలు చేయబోమని సీఎం డీకే శివకుమార్‌ ప్రకటించడంతో కోస్తా, మల్నాడు జిల్లాల ప్రజలు కాస్త శాంతించారు. కరువు కష్టాల్లో ఉన్న రైతులకు రూ.2,500 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. చివరిరోజు సైతం ఉభయ సభల్లో ఇరుపక్షాలూ ఆరోపణలు సంధించుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement