రాయచూరు రూరల్: నగరంలో తొమ్మిదో రోజున 237 వినాయక విగ్రహాల నిమజ్జనాలు వైభవంగా జరిగాయి. బుధవారం తెల్లవారు జాము నుంచి ప్రారంభమైన వినాయక విగ్రహాల ఊరేగింపు మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగింది. తీన్ కందిల్ నుంచి సూపర్ మార్కెట్, మహావీర్ సర్కిల్, మహాబళేశ్వర చౌక్, షరాఫ్ బజారు, పేట్లా బురుజు మీదుగా ఖాస్ బావి వరకు డీజే శబ్దంతో నృత్యం చేస్తూ గణనాథులను నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా జిల్లాధికారిణి పూవిత, ఎస్పీ అరుణాంగ్శు గిరి, డీఎస్పీ హరీష్‌లున్నారు. మహాబళేశ్వర్ రహదారిలో అడ్డంగా నిలబడి ట్రాఫిక్ స్తంభించి పోవడంతో పొలీసులు లాఠీచార్జీ చేశారు.
ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం
హొసపేటె: విజయనగర జిల్లా వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం 9వ రోజు గణేష్ నిమజ్జనం కట్టుదిట్టమైన పోలీసు భద్రత నడుమ ప్రశాంతంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా 29 గణేష్ విగ్రహాలను తొమ్మిదో రోజు నిమజ్జనం చేయగా, హొసపేటె నగర పరిధిలో 4 గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేశారు. సాయంత్రం 7 గంటలకు మొదలైన భారీ వర్షం ఊరేగింపునకు కొంత ఆటంకం కలిగించింది. అయినప్పటికీ కుండపోత వర్షంలో కూడా యువత డీజేల సంగీతానికి నృత్యం చేస్తూ, కేరింతలు కొట్టారు. రాత్రి 10 గంటల వరకు విగ్రహాల ఊరేగింపు సాగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం నేపథ్యంలో డీజే పరికరాలను టార్పాలిన్‌లతో కప్పి ఊరేగింపుగా తీసుకువెళ్లారు. 9వ రోజు గణేష్ నిమజ్జనం నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఎస్.జాహ్నవి భారీ పోలీసు బలగాలను బందోబస్తుకు మోహరించారు.
తొమ్మిదో రోజు వినాయకుల నిమజ్జనం
భారీ వర్షంలో కూడా యువత కేరింత


