ఉత్తమ సేవలకు సత్కారం
బళ్లారి అర్బన్: బెంగళూరులోని ఎంఎన్‌ఎన్ కన్నడ న్యూస్ చానల్ కార్యాలయంలో సావిత్రీ బాయి పూలే జయంతి సందర్భంగా ఉత్తమ సేవలందించిన ఐదుగురు మహిళలను సత్కరించారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ చైతన్య సమితి కర్ణాటక రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జానకి మోహన్ మాట్లాడారు. దేశంలోని ప్రతి ఒక్కరూ సావిత్రి బాయి పూలే జయంతిని జరుపుకోవాలన్నారు. మహిళా అధ్యక్షురాలిగా బీసీల సంక్షేమం కోసం అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తామని తెలిపారు. జాతీయ బీసీ చైతన్య సమితి బళ్లారి జిల్లా అధ్యక్షురాలు సుజాత మాట్లాడుతూ.. బీసీలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని, వారి కోసం దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టనున్నామన్నారు. కార్యక్రమంలో బీసీ చైతన్య సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు బీసీ రమణ, జాతీయ ఉపాధ్యక్షుడు గిరి యాదవ్, జాతీయ కార్యదర్శి వెంకటరమణ, బీసీ చైతన్య సమితి జాతీయ కార్యదర్శి జ్యోతి కుమార్, బెంగళూరు యు.కృష్ణమోహన్, బళ్లారి రవీంద్ర, మనోజ్, దివ్య యాదవ్, శరణమ్మ, యాంకర్ దివ్య, ప్రజ్వల్, చిరంజీవి సుప్రీత్, గాయత్రి, సత్య ప్రకాష్ బీసీ చైతన్య సమితి జాతీయ రాష్ట్ర, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


