బౌద్ధ అధ్యయన కేంద్రానికి స్థలం కేటాయించండి
కోలారు: బంగారుపేట తాలూకాలో బౌద్ధ అధ్యయన కేంద్రం ఏర్పాటుకు స్థలం మంజూరు చేయాలని కేజీఎఫ్ అశోక దమ్మధూత బౌద్ధ సంఘం సంచాలకుడు డాక్టర్ ఆర్.ప్రభురాం విజ్ఞప్తి చేశారు. ఈమేరకు శనివారం జిల్లా కలెక్టర్ ఎం.ఆర్.రవికి వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ కేజీఎఫ్‌లో అశోక దమ్మధూత బౌద్ధ సొసైటీ ద్వారా బౌద్ధ ధర్మ ప్రచారంతో పాటు అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈక్రమంలో బౌద్ధ అధ్యయన కేంద్రాన్ని స్థాపించాలని చాలా మంది అడుగుతున్నారని, కనీసం ఐదు ఎకరాలు కేటాయించాలని కోరారు. ఇందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.


