శీఘ్రగతిన టీబీ డ్యాం గేట్ల పనులు: సీఎం | - | Sakshi
Sakshi News home page

శీఘ్రగతిన టీబీ డ్యాం గేట్ల పనులు: సీఎం

Jan 5 2026 7:38 AM | Updated on Jan 5 2026 7:38 AM

శీఘ్ర

శీఘ్రగతిన టీబీ డ్యాం గేట్ల పనులు: సీఎం

రాయచూరు రూరల్‌: తుంగభద్ర డ్యాంకు సంబంధించిన క్రస్ట్‌ గేట్లను శీఘ్రగతిన అమరుస్తాని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య పేర్కొన్నారు. శనివారం రాత్రి సింధనూరు తాలుకా అంబామఠం ఉత్సవాలను ప్రారంభించిన ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రైతులకు ఇబ్బందులు కలగకుంగా వచ్చే ఖరీఫ్‌ నాటికి క్రస్‌ గేట్లు అమర్చే పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే రూ.20 కోట్లతో క్రస్ట్‌ గేట్లు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. కర్ణాటక సర్కార్‌ రూ.10 కోట్ల నిధులు విడుదల చేసిందని తెలిపారు. మరో 18 క్రస్ట్‌ గేట్లు తయారు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు 7 టీఎంసీలు, తెంగాణలకు 5 టీఎంసీలు చొప్పున మొత్తం 12 టీఎంసీల నీటిని విడుదల చేయడం జరుగుతుందన్నారు. పంచ గ్యారెంటీలకు రూ.1,12,000 కోట్ల వ్యయం చేశామని తెలిపారు.

ఆశ్రమంలో అన్నదానం

బళ్లారి అర్బన్‌: బళ్లారికి చెందిన మంగళముఖి చాందిని 35వ జన్మదినం సందర్భంగా గాంధీ నగర్‌లోని శ్రీ సూర్య నివాస్‌ వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు, బెడ్‌ షీట్లు అందజేశారు. ఈ ఏడాది వృద్దులకు తనవంతు సేవ చేసి ఆశీర్వాదం పొందడంతో ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చాందిని తెలిపారు. అనంతరం వృద్ధులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో వైజాగ్‌ సత్య, హైదరాబాద్‌ ఐసుమతి, బళ్లారి హనీ, ధర్మవరం నరిత, కృష్ణ, శైలజ, హేమావతి, వినోద్‌, గాయత్రి లక్ష్మీ పాల్గొన్నారు.

‘శాంతిభద్రతల

పరిరక్షణలో సీఎం విఫలం’

సాక్షి బళ్లారి: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. శాంతిభద్రతలు కాపాడటంలో సీఎం సిద్దరామయ్య విఫలమయ్యారు. ఫ్లెక్సీ ఏర్పాటు వివాదంలో ఓ యువకుడు మృతి చెందడంతో ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డిని అరెస్ట్‌ చేయాలి’ అని మాజీ మంత్రి రేణుకాచార్య పేర్కొన్నారు. ఆదివారం ఆయన మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి తదితరులుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. డ్రగ్స్‌, మద్యం తీసుకుని సినీ ఫక్కీలో గొడవలు సృష్టించి, గాలి జనార్దన రెడ్డిపై కాల్పులు జరిపారన్నారు. హత్య చేసేందుకు యత్నించడంతో దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలన్నారు. తమ పార్టీ గాలి కుటుంబానికి అండగా ఉంటుందని తెలిపారు. ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు, కేంద్రమంత్రులు గాలి ఇంటికి చేరుకుని బాసటగా నిలిచారన్నారు.

ముగిసిన

అంబా మఠం జాతర

రాయచూరు రూరల్‌: సింధనూరు తాలుకాలోని సిద్ధ పర్వతం అంబా మఠం మాతేశ్వరి జాతరలో భాగంగా రథోత్సవం వైభవంగా జరిగింది. శనివారం సాయంత్రం రథోత్సవాన్ని ముఖ్యమంత్రి సిద్ద రామయ్యతో పాటు లక్షలాది మంది భక్తుల సముక్షంలో నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలిచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తిశ్రద్ధలతో రథాన్ని లాగారు. కార్యక్రమంలో శాసన సభ్యులు హంపన గౌడ బాదర్లి, హంపయ్య నాయక్‌, బసవన గౌడ దద్దల్‌, వసంత్‌ కుమార్‌ బసన గౌడ, జిల్లా అధికారి నితీష్‌, ఎస్పీ అరుణాంగ్సు గిరి పాల్గొన్నారు.

ఉగ్రయ్యకు

సేవా రత్న అవార్డు

హుబ్లీ: కర్ణాటక మానవ హక్కుల సంరక్షణ సంస్థ, డాక్టర్‌ నాగలక్ష్మి చౌదరి జనసేవ సంస్థ, చెన్నమ్మ మంజేగౌడ జనసేవ సంస్థ, ఆధ్వర్యంలో వృక్షమాత సాలుమరద తిమ్మక్క సేవ రత్న ప్రశస్తి–2026ను సి.ఉగ్రయ్యకు ప్రదానం చేశారు. గత 50 ఏళ్లుగా బెంగళూరు మాగడి రోడ్డులోని గాంధీ వృద్ధాశ్రమంలో అనాథలకు ఉగ్రయ్య సేవలందిస్తున్నారు. లగ్గేరే బసవేశ్వర కళ్యాణ మంటపంలో నిర్వహించిన కార్యక్రమంలో నిర్వహకుడు గణేష్‌ గౌడ్రు మాట్లాడారు. గత 5 దశబ్దాలుగా ఉగ్రయ్య నిరాశ్రయులకు సేవ చేయడం హర్షణీయమన్నారు.

శీఘ్రగతిన టీబీ డ్యాం  గేట్ల పనులు: సీఎం 1
1/1

శీఘ్రగతిన టీబీ డ్యాం గేట్ల పనులు: సీఎం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement