నిందితులను అరెస్ట్‌ చేయాలి | - | Sakshi
Sakshi News home page

నిందితులను అరెస్ట్‌ చేయాలి

Jan 4 2026 7:05 AM | Updated on Jan 4 2026 7:05 AM

నింది

నిందితులను అరెస్ట్‌ చేయాలి

రాయచూరు రూరల్‌: దార్వడ జిల్లా హుబ్లీలో జరిగిన పరువు హత్య కేసులో నిందితులను అరె్‌స్ట్‌ చేయాలని అఖిల భారత సామాజిక కార్యకర్త ప్రభురాజ్‌ మకోడ్లి డిమాండ్‌ చేశారు. శనివారం సిందనూరు ప్రభత్వ అతిథి నివాసం వద్ద ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు వినతిపత్రం అందజేశారు. ప్రేమ పేరుతో కులంతర వివాహం చేసుకుందన్న కోపంతో ఎస్సీకి చెందిన వివేకానంద, ఏడు నెలల గర్భిణి మాన్యా పాటిల్‌ను తల్లిదండ్రులు హత్య చేశారని తెలిపారు. వివేకానంద, మాన్యా పాటిల్‌ను హత్య చేసిన నిందితులను అరెస్ట్‌ చేసి కోరారు. వివేకానంద కుటుంబానికి పోలీస్‌ భద్రత కల్పించాలన్నారు.

ఘనంగా తెప్పోత్సవం

రాయచూరు రూరల్‌: కోప్పళ గవి మఠంలో అభినవ సిద్ధేశ్వర శివాచార్యుల జాతరలో భాగంగా శుక్రవారం రాత్రి ఘనంగా తెప్పోత్సవం నిర్వహించారు. లక్షలాది మంది భక్తుల ఆధ్వర్యంలో గంగాహారతి ఇచ్చారు. అనంతరం భక్తులకు రొట్టెలు, బజ్జీలు, మాదిలి, జిలేబీని ప్రసాదంగా అందజేశారు.

బళ్లారిలో

బ్యానర్ల తొలగింపు

సాక్షి బళ్లారి: నగరంలో మహర్షి వాల్మీకి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఫ్లెక్సీల ఏర్పాటు వివాదంగా మారిన విషయం తెలిసిందే. నగరంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు వేసి ఘనంగా నిర్వహించాలని భావించిన కాంగ్రెస్‌ నేతలకు ఎదురు దెబ్బ తగిలింది. కాల్పుల్లో ఓ యువకుడు మృతి చెందడంతో నగరంలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా భారీ ఎత్తున పోలీసులను మొహరింపజేశారు. మహర్షి వాల్మీకి విగ్రహ ప్రతిష్టాపన వాయిదా పడింది. శనివారం ఉదయం నుంచి నగరంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, కాషాయ జెండాలు, శ్రీరాముడు, వాల్మీకి చిత్రపటాలను కార్పొరేషన్‌ సిబ్బంది తొలగించారు.

ముగ్గురిపై పోక్సో కేసు

హుబ్లీ: హుబ్లీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ చిన్నారిపై సామూహిక హత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల పరిచయం అయిన ముగ్గురు బాలురు సదరు మైనర్‌ బాలికపై ఈ ఘాతకానికి పాల్పడినట్లు సమాచారం. బాధిత చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు మైనర్‌ బాలురును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. బాలికను హత్యచారం చేసిన దృశ్యాలను బాలురు వీడియో తీసి పెట్టుకున్నారు. ముగ్గురిపై పోక్సో కేసు నమోదైంది.

రోడ్డు భద్రతా

మాసోత్సవాలు ప్రారంభం

హొసపేటె: జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను శనివారం జిల్లా సెషన్స్‌ జడ్జి కుమార్‌ స్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 30వ తేదీ వరకు జరగనున్న రోడ్డు భద్రతా వారోత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియామాలు పాటించాలని తెలిపారు. అనంతరం రవాణా శాఖ ఉద్యోగులతో కలిసి కరపత్రాలను ఆవిష్కరించారు. ఆ తర్వాత జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో పలువురు డ్రైవర్లకు అవగాహన కల్పించి భద్రతా నిబంధనలు పాటిస్తామని ప్రమాణం చేయించారు. అంతకుముందు నగరంలో గాంధీ కూడలి నుంచి ర్యాలీని ప్రారంభించి ప్రముఖ వీధుల గుండా పుణీత్‌ కూడలి వరకు నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు జిల్లా అధికారి బాలకృష్ణ, తహసీల్దార్‌ శృతి, అదనపు జిల్లా ఎస్పీ మంజునాథ్‌, ఆర్టీఓ దామోదర్‌, బీఈఓ శేఖర్‌ హొరపేట్‌, నగరసభ అధికారి శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

నిందితులను అరెస్ట్‌ చేయాలి1
1/3

నిందితులను అరెస్ట్‌ చేయాలి

నిందితులను అరెస్ట్‌ చేయాలి2
2/3

నిందితులను అరెస్ట్‌ చేయాలి

నిందితులను అరెస్ట్‌ చేయాలి3
3/3

నిందితులను అరెస్ట్‌ చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement