మనసంతా చిత్రసంతె
● సిలికాన్ సిటీని మురిపించిన పెయింటింగ్స్ జాతా
బనశంకరి: బెంగళూరులో ఏడాదికి ఒకరోజు జరిగే చిత్రలేఖనాల ప్రదర్శన.. చిత్రసంతె ప్రజలకు కనువిందు చేసింది. కుమారకృప రోడ్డు ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకూ, అలాగే సోమవారం కూడా కొన్ని స్టాళ్లలో చిత్రలేఖనాల ప్రదర్శన, విక్రయాలు జరిగాయి. విభిన్న రూపాల పెయింటింగ్స్ అబ్బురపరిచాయి. ఈదఫా చిత్రసంతెను 3 లక్షల మందికిపైగా సందర్శకులు వీక్షించగా, రూ.3 కోట్లకు పైగా పెయింటింగ్స్ వ్యాపారం జరిగినట్లు చిత్రకళాపరిషత్ సభ్యులు తెలిపారు.
భారీ ధరలకు విక్రయం
కొన్ని కళాఖండాలు భారీ రేట్లకు అమ్ముడుపోయాయి. బెంగళూరు కళాకారుడు భరణి ధరణ్ తైలవర్ణ నెమలి పెయింటింగ్‌ను రూ.లక్షకు విక్రయించారు. మైసూరు కళాకారుడు వీరేశ్ గీసిన ప్రకృతిలో శివుడు కళాకృతి రూ.1.30 లక్షలకు కొనుగోలు చేశారు. కోయంబత్తూరు సతీశ్ గీసిన ప్రపంచంలోని ప్రముఖ వ్యక్తులు ఒకేచోట చేరిన పెద్ద చిత్రలేఖనం రూ.3 లక్షల అమ్ముడుపోయింది. ఇలా కొందరు చిత్రకారులకు కాసుల వర్షం కురిసింది. వైవిధ్య వర్ణచిత్రాలను తిలకించి నగరవాసులు మురిసిపోయారు. వందలాది చిత్రకారులు తమ చిత్రలేఖనాలను అమ్ముకుని సంతృప్తిగా వెనుదిరిగారు.
లెక్కకు మిక్కిలి పెయింటింగ్స్
ముఖానికి వర్ణ అలంకారంతో బాలిక
చిత్రలేఖనాలతో ఓ చిత్రకారిణి
రమణీయంగా మయూరాలు
పెయింటింగ్స్ వీక్షణం
మనసంతా చిత్రసంతె
మనసంతా చిత్రసంతె
మనసంతా చిత్రసంతె
మనసంతా చిత్రసంతె
మనసంతా చిత్రసంతె


