నేరాల నియంత్రణపై ముమ్మర ప్రచారం
రాయచూరు రూరల్: నేటి ఆధునిక యుగంలో సైబర్ నేరాల నియంత్రణకు పోలీస్ యంత్రాంగం నడుం బిగించాలని ఎస్పీ అరుణాంగ్షు గిరి పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని సైబర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి అధికారులకు సలహా సూచనలు ఇచ్చారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సైబర్ నేరాలు, పోక్సో చట్టం, ట్రాఫిక్ నియమాలు, ఈఆర్‌ఎస్ 112, 1930 సహాయవాణి ద్వారా ప్రజలు సహకరించాలన్నారు. ఈ విషయంలో సాంకేతిక రంగంలో మార్పులు వచ్చినా నేరాలు కట్టడి కాకపోవడంపై అందరూ ఆలోచించాలన్నారు. ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగాంవంటి వాటిని వినియోగించే ముందు ఆలోచించుకోవాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ హరీష్, డీఎస్పీ శాంతవీర, ఇతర పోలీస్ అధికారులున్నారు.


