హుబ్లీలో పోలీసులు వర్సెస్ బీజేపీ
హుబ్లీ: హుబ్లీలో తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. తమ మహిళా కార్యకర్తను పోలీసులు వివస్త్రను చేశారంటూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఠాణాను చుట్టుముట్టడంతో గందరగోళం నెలకొంది. ఇంతకూ జరిగింది ఏమిటంటే.. సదరు మహిళ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు, ఇటీవల బీజేపీలోకి చేరారు. 5వ తేదీన ఓటరు జాబితా గురించి బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు గలాటా పడ్డారు. ఆమె మీద గదగ్ రోడ్డు గాంధీవాడ ప్రాంతవాసులతో కలిసి 59వ వార్డు కార్పొరేటర్ సువర్ణ కల్లకుంట్ల కేశ్వాపుర ఠాణాలో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి అరెస్టు చేయడానికి ప్రయత్నించగా ప్రతిఘటించింది. దీంతో పోలీసులు, ఆమె మధ్య తోపులాట జరిగి దాడి వరకూ వచ్చింది. పోలీసులు ఆమెను ఈడ్చుకొచ్చి జీపులో కూర్చోబెట్టారు, అప్పటికే ఆమె వివస్త్రగా మారింది, అలాగే పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ మేరకు వీడియోలు వైరల్ అయ్యాయి.
ఠాణా ముట్టడి
ఈ నేపథ్యంలో బాధితురాలికి న్యాయం చేయాలని, దాడి చేసిన పోలీసులను శిక్షించాలని బుధవారం సాయంత్రం నుంచి కేశ్వాపుర ఠాణా ముందు బీజేపీ నేతలు, కార్యకర్తలు బైఠాయించారు. పోలీసులు ఎంత చెప్పినా వారు పట్టించుకోలేదు. దీంతో బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. కొందరిని అరెస్టు చేశారు. బాధిత మహిళ కూడా ఈ ధర్నాలో పాల్గొని పోలీసులపై ఆరోపణలు చేసింది.
ఆమే తీసేశారు: కమిషనర్
పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి వాహనంలో కూర్చోబెట్టగా, ఆమే బట్టలు తీసి వేశారని హుబ్లీ పోలీసు కమిషనర్ ఎన్.శశికుమార్ వివరణ ఇచ్చారు. కేశ్వాపుర ఠాణాకు వచ్చి ఏం జరిగిందో విచారించారు. మీడియాతో మాట్లాడారు. పోలీసులు అరెస్టు చేసినప్పుడు ఆమె దుస్తులతోనే ఉన్నారు, అదుపులోకి తీసుకునేటప్పుడు ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రతి దాడి చేశారు. మగ కానిస్టేబుల్‌ను తోసివేసి తప్పించుకునే యత్నం చేశారు, నోటితో కరిచారు, ఆమె అంతగా రెచ్చిపోతుంటే, పోలీసు వాహనంలోకి ఎక్కించుకొనే వేళ వివస్త్ర అయ్యారు, పోలీసులు స్థానికుల ద్వారా వేరే బట్టలను తెచ్చి ఆమెకు ధరింపజేశారు అని చెప్పారు. ఈమెకు నేరచరిత ఉందని, గతేడాది 5 కేసులు దాఖలయ్యాయి, ఈ 7 రోజుల్లో 7 కేసులతో నమోదైనట్లు తెలిపారు. మహిళ వివస్త్రగా మారిన వీడియోలను ఎవరు వైరల్ చేశారన్నది దర్యాప్తు చేస్తామని చెప్పారు.
అరెస్టు వేళ బీజేపీ మహిళా
కార్యకర్తను వివస్త్రను చేశారని ధ్వజం
పోలీసు స్టేషన్ ముట్టడి.. ఉద్రిక్తత
సీఎం ఏమన్నారు?
సీఎం సిద్దరామయ్య ఈ ఘటనపై స్పందిస్తూ ఆ మహిళ పోలీసులను కొరికింది, వెరీబ్యాడ్, ఈ సమయంలో 10 మంది పోలీసులు, వారు చట్టపరమైన చర్యలు తీసుకున్నారని సమర్థించారు.
హుబ్లీలో పోలీసులు వర్సెస్ బీజేపీ
హుబ్లీలో పోలీసులు వర్సెస్ బీజేపీ


