లోకాయుక్తలో 45 వేల కేసుల నమోదు
రాయచూరు రూరల్: కల్యాణ కర్ణాటక భాగంలో ఈనెల 7వ తేదీ వరకు లోకాయుక్త అధికారులు ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు చేశారని లోకాయుక్త రిజిస్ట్రార్ ఏ.వీ.పాటిల్ పేర్కొన్నారు. బుధవారం జిల్లాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది విధుల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల విధి నిర్వహణలో లోపాలు కనిపించాయన్నారు. ఆస్తి పన్ను, రిజిేస్ట్రేషన్ సాంకేతిక విభాగం, ఇతరత్ర పరిశీలన జరపాలన్నారు. అధికారులు, సిబ్బంది వ్యవహరిస్తున్న తీరును చూసి మండిపడ్డారు. రికార్డులను సక్రమంగా వినియోగించక పోవడం, ఇష్టం వచ్చినట్లు పేపర్లు పారవేయడంతో ఆక్రోశించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై విరుచుకు పడ్డారు. రారష్ట్‌రంలో లోకాయుక్త పరిధిలో 45 వేల కేసులు నమోదు కాగా 20 వేల కేసులు పరిష్కరించామని వివరించారు. చెరువులను, రాజ కాలువల ఆక్రమణలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. కార్యదర్శి శ్రీనాథ్, లోకాయుక్త ఎస్పీ సతీష్, జిల్లాధికారి నితీష్, ఎస్పీ అరుణాంగ్షు గిరి, నగరసభ కమీషనర్ జుబిన్ మహాపాత్రోలున్నారు.
ఇప్పటికే 20 వేల కేసుల పరిష్కారం
లోకాయుక్త రిజిస్ట్రార్ ఏ.వీ.పాటిల్


