అయ్యప్ప మాలధారులకు అన్నదానం
రాయచూరు రూరల్: మకరజ్యోతి దర్శనానికి వెళుతున్న అయ్యప్ప మాలధారులకు మైనార్టీ సోదరులు అన్నదానం చేశారు. గురువారం లింగసూగూరులో ముిస్లిం–ఏ–అంజుమన్ కమిటీ అధ్యక్షుడు రఫీ ఆధ్వర్యంలో 40 మందికి అన్నదానం నిర్వహించారు. హిందూ ముస్లింలు సఖ్యత, ఐకమత్యంతో శాంతి సౌహార్ధతను కాపాడుతున్నామని రఫీ అన్నారు. విజయ్, అన్వర్‌బాయి, హుస్సేన్‌బాషా, ముస్తఫా, సలీం, ఆసిఫ్, ఇబ్రహీం, అరీఫ్, ఆది పాల్గొన్నారు.
ప్రజాస్వామ్యానికి
ఆయువు పట్టు ఓటు హక్కు
రాయచూరు రూరల్: ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు హక్కు ఆయువు పట్టు వంటిదని జిల్లా ఎన్నికల అధికారి పీ.బసవరాజ్ పేర్కొన్నారు. గురువారం జెడ్పీ జలనిర్మల సభాంగణంలో అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటరు జాబితాలో పేర్ల నమోదు, తొలగింపులపై ఆయన బీఎల్‌ఓలు, తహసీల్దార్లకు పలు సూచనలు జారీ చేశారు. గ్రామీణ ప్రాంత ఓటరు జాబితాల్లోని లోపాలను సవరించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో నోడల్ అధికారి వస్త్రద్, వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ హనుమంతప్ప, అధికారులు సురేష్‌వర్మ, రమేష్, సోమశేఖర్ పాల్గొన్నారు.
నిందితునిపై చర్యలు చేపట్టండి
హుబ్లీ: ఇటీవల దళిత మహిళ రంజితను హత్య చేసిన నిందితుడు రఫీని, అతడి కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయాలని విశ్వ హిందూ పరిషత్, భజరంగదళ్ డిమాండ్ చేశాయి. గురువారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు రవికృష్ణ మాట్లాడారు. నేటి ఆధునిక సమాజంలో హిందూ యువతులకు రక్షణ కరువైందన్నారు. మైనార్టీ యువకులు ప్రేమ పేరుతో హిందూ యువతులను మోసం చేస్తున్నారన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు చేపట్టి శిక్షలను విధించాలని కోరుతూ స్థానిక అధికారికి వినతిపత్రాన్ని సమర్పించారు. శ్రీనివాస్, రాకేష్, రాజేష్, శరణులు ఉన్నారు.
ఎస్సీ, ఎస్టీ కేసుల్లో
జాప్యం తగదు
రాయచూరు రూరల్: ఇటీవల కాలంలో జిల్లాలో ఎస్సీ, ఎస్టీలపై అధికమవుతున్న దాడుల నియంత్రణకు అధికారులు శ్రద్ధ చూపాలని జిల్లాధికారి నితీష్ పేర్కొన్నారు. గురువారం తన కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీలపై దాడుల నియంత్రణపై జరిగిన సమావేశంలో అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో దళిత వార్డుల్లో అంటరానితనం వంటి అమానుషాలను అరికట్టాలన్నారు. మరో వైపు దాడులు జరిగినప్పుడు కేసులు నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు చేపట్టాలని దళిత నేతలు రవీంద్రనాథ్ పట్టి, విశ్వనాథ్, శరణప్ప జిల్లాధికారిని డిమాండ్ చేశారు.
భూగర్భ జలాల వృద్ధికి సహకరించాలి
రాయచూరు రూరల్: భూగర్భ జలాల పెరుగుదలకు రైతులు సహకరించాలని స్వామి వివేకానంద యువజన సంఘం అధికారి రమేష్ పేర్కొన్నారు. గురువారం రాయచూరు తాలూకా యాపలదిన్ని మండలం రాళ్లదొడ్డిలో పురాతన బావి జీర్ణోద్ధరణ పనులకు శ్రీకారం చుట్టి మాట్లాడారు. వర్షాకాలంలో భూమిలో, చెరువులు, ఇంకుడు గుంతల్లో భూగర్భ జలాలను పెంచడానికి ఇలాంటి శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో అడుగంటి పోతున్న జలవనరులను భావి తరాలకు అందించాలన్నారు. కార్యక్రమంలో రామిరెడ్డి, పంపాపతి, శరణయ్య, వినోద్, ఈరణ్ణలున్నారు.
అయ్యప్ప మాలధారులకు అన్నదానం
అయ్యప్ప మాలధారులకు అన్నదానం
అయ్యప్ప మాలధారులకు అన్నదానం


