హిప్పరగి డ్యాం గేట్ ధ్వంసం
రాయచూరు రూరల్: బాగలకోటె జిల్లా జమఖండి తాలూకాలో హిప్పరగి గ్రామం వద్ద కృష్ణా నదిపైనున్న హిప్పరగి డ్యాం గేట్ తెగి నీరు వృథా అవుతోంది. మంగళవారం సాయంత్రం డ్యాం గేట్ గొలుసు తెగిపోయింది. దీంతో సదరు గేటు తెగిపోయి నీరు భారీగా వెళ్లిపోతోంది. డ్యాంలో ఇప్పుడు 6 టీఎంసీలు నీరుంది. 22వ గేటు ధ్వంసం కావడంతో నీటి నిల్వ తగ్గుతోంది. ఈ బ్యారేజ్ అథణి తాలూకాకు సాగు, తాగు నీటిని అందిస్తోంది. వేసవి రాబోతున్న సమయంలో నీరు వృథా అవుతోందని స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సమాచారం అందగానే బాగల్‌కోటె ఇన్‌చార్జి, ఎకై ్సజ్ శాఖ మంత్రి ఆర్బీ తిమ్మాపూర్ బుధవారం వెళ్లి పరిశీలించారు. డ్యాంలో నీటి నిల్వ ఎక్కువగా ఉన్నందున కృష్ణ భాగ్య జల మండలి అధికారులతో చర్చించి నీటిని వృథా కాకుండా అరికట్టాలని, సత్వరం మరో గేట్‌ను అమర్చాలని సూచించారు. మంత్రి వెంట జిల్లాధికారి, ఇతర నీటిపారుదల శాఖ అధికారులున్నారు. మరమ్మతు పనులు జరుగుతున్నాయి.
వృథాగా పోతున్న
కృష్ణా జలాలు
బాగల్‌కోట జిల్లాలో ఘటన
మంత్రి తిమ్మాపూర్
తనిఖీ


