ఎమ్మెల్యే చాటింగ్ రచ్చ
శివాజీనగర: తన ఇన్‌స్టా ఖాతాను హ్యాక్ చేసి ఓ యువతికి మెసేజ్ పంపి చెడ్డపేరు తీసుకొచ్చే కుట్ర జరిగింది, ఇది కాంగ్రెస్ ఐటీ టీం పని అని బీజేపీ ఎమ్మెల్యే సీ.కే.రామమూర్తి ఆరోపించారు. ఆయన ఖాతాతో ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో చాటింగ్‌లు వైరల్ అయ్యాయి. దీనిపై మీడియాతో స్పందిస్తూ, రీల్స్ బాగుందని హాసన్‌కు చెందిన మహిళకు మెసేజ్ వెళ్లింది, వెంటనే కాంగ్రెస్ ఐటీ టీం వైరల్ చేసింది. ఇది ఎలా సాధ్యం? అని అన్నారు. నా పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలున్నాయి, నా ఖాతా రెండుసార్లు హ్యాక్ అయ్యింది అని చెప్పారు. యూత్ కాంగ్రెస్ టీంపై పరువునష్టం కేసు వేస్తానని అన్నారు.


