అధికారులపై ఎమ్మెల్యే విసుర్లు
రాయచూరు రూరల్: గ్రామీణ అసెంబ్లీ పరిధిలో వివిధ అభివృద్ధి పథకాలకు సంబంధించి జరిగిన కేడీపీ సమావేశంలో గ్రామీణ ఎమ్మెల్యే బసనగౌడ దద్దల్ అధికారులపై మండిపడ్డారు. మంగళవారం తాలూకా పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జెస్కాం, సాంఘీక సంక్షేమ శాఖ, పంచాయతీ అభివృద్ధి అధికారుల మధ్య సమన్వయం లభించిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నెలకొనకుండా చూడాలన్నారు. రహదారి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, అధికారులు, కాంట్రాక్టర్లు అభివృద్ధి పనులను నాణ్యతతో చేపట్టాలని ఆదేశించారు. తోటల పెంపకానికి ప్రాధాన్యత కల్పించాలని, విద్యుత్ మీటర్ లేదు, బిల్ కట్టలేదంటూ విద్యుత్‌ను కట్ చేయరాదన్నారు. అక్రమంగా ఇసుక రవాణ నియంత్రణకు అధికారులు ముందుండాలన్నారు. పీడీఓలు గ్రామాల్లో పర్యటించి సమస్యలపై స్పందించాలని సూచించారు. సమావేశంలో ఏపీఎంసీ అధ్యక్షుడు మల్లికార్జున గౌడ, ఆర్ ఏపీఎంసీ అధ్యక్షుడు జయంతిరావ్, పంచ గ్యారెంటీల అధ్యక్షుడు పవన్ పాటిల్, టీపీ ఈఓ చంద్రశేఖర్, ఏసీ హంపన్న, తహసీల్దార్ సురేష్ వర్మ, అధికారిణి వనిత, శరణ బసవ, సభ్యులు పల్లవి, ఈరేశ, రామప్ప, శ్రావణి, తిమ్మప్ప, చెన్నబసవనాయక్, ఫారూక్, జిలానీలున్నారు.


