పోస్టుమార్టంపై గందరగోళం
సాక్షి,బళ్లారి: జనవరి 1వ తేదీన రాత్రి గాలి జనార్దనరెడ్డి ఇంటి వద్ద బ్యానర్ రగడ అనంతరం కాల్పులు జరగడంతో ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి ఆప్తుడు సతీష్‌రెడ్డికి చెందిన గన్‌మెన్ గురుచరణ్ సింగ్ కాల్చడంతో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మృతి చెందినట్లు ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు తేల్చిన సంగతి విదితమే. సతీష్‌రెడ్డి ముగ్గురు గన్‌మెన్లు గురుచరణ్‌సింగ్, మహేంద్రసింగ్, బల్జీత్‌సింగ్‌లను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన నాలుగు రోజుల నుంచి రోజురోజుకు కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తుండంటంతో రాష్ట్రంలోనే బళ్లారి ఘటన హాట్‌టాపిక్‌గా మారింది. రాజశేఖర్ మృతదేహానికి పోస్టుమార్టంలో లోపాలు జరిగాయని, మొదట బుల్లెట్‌ను వెలికితీయకుండానే ముగించారని, కొందరు వైద్యులు ప్రశ్నించడంతో మరోదఫా పోస్టుమార్టం నిర్వహించి తూటాను బయటకు తీసినట్లు సమాచారం. దీంతో పోస్టుమార్టం వ్యవహారం మిస్టరీగా మారింది. ఇక పోస్టుమార్టం చేసిన వైద్యుల సమాధానం ఏమిటో తెలియాల్సి ఉంది.
బుల్లెట్ల ఆచూకీ కోసం ముమ్మర గాలింపు
సోమవారం హుబ్లీ–ధాఽర్వాడ నుంచి విచ్చేసిన ప్రత్యేక ఎఫ్‌ఎస్‌ఎల్ బృందాలు గాలి జనార్దనరెడ్డి ఇంటి వద్దకు చేరుకుని బుల్లెట్ల శకటాల కోసం ఘటన స్థలాన్ని క్షుణ్ణంగా గాలించారు. ఈ సోదాల్లో ఓ బుల్లెట్ లభ్యమైంది. గాలి ఇంటిపైకి గురిపెట్టి కాల్చడంతో అద్దాలు పగిలిపోగా వాటిని కూడా పరిశీలించారు. మెటల్ డిటెక్టర్ల సాయంతో ఇంటి పరిసరాలను కూడా జల్లెడ పడుతున్నారు. ఆదివారం అరెస్టు చేసిన 26 మందిని పోలీసులు కోర్టులో హాజరు పరిచి, బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించారు. వీరిని బళ్లారి జైలులో ఉంచడం మంచిది కాదని బెంగళూరుకు పంపించడం గమనార్హం. కాగా గాలి జనార్దనరెడ్డిని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన పలువురు బీజేపీ నాయకులు పరామర్శలు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, పలువురు బీజేపీ నాయకులు గాలిని పరామర్శించారు. అభిమానులు పెద్ద సంఖ్యలో వస్తుండడంతో గాలి ఇంటి వద్ద కోలాహలం నెలకొంది.
ఎన్నిసార్లు చేశారో తెలియక మిస్టరీ
రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా బళ్లారి ఘటన
పోస్టుమార్టంపై గందరగోళం
పోస్టుమార్టంపై గందరగోళం
పోస్టుమార్టంపై గందరగోళం
పోస్టుమార్టంపై గందరగోళం


