ఆధునిక జ్ఞానానికి విలువల మిళితం
మైసూరు: ‘ఆధునిక జ్ఞానాన్ని విలువలతో మిళితం చేసే విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయవలసిన అవసరం చాలా ముఖ్యం‘ అని గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ అన్నారు. సోమవారం మైసూరు క్రాఫోర్డ్ ఆడిటోరియంలో మైసూరు విశ్వవిద్యాలయం 106వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగిస్తూ భారతీయ సంస్కృతి, విద్యారంగం గొప్పదనాన్ని వివరించారు. కొత్త జాతీయ విద్యా విధానం ఒక ముఖ్యమైన అడుగు అన్నారు. నేటి ప్రపంచం వేగంగా మార్పు చెందుతోంది. సైన్స్– టెక్నాలజీ, ఏఐ, డిజిటల్ ఎకానమీ వంటి రంగాలలో యువత ప్రాధాన్యం వహిస్తోందని తెలిపారు. భారతదేశం లక్ష్యాలను సాధించడంలో మీ జ్ఞానం, కృషి ప్రధాన పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వందలాది పట్టభద్రులకు డిగ్రీ, పీజీ పట్టాలు, పీహెచ్‌డీ పట్టాలను బహూకరించారు. అలాగే సినీ దర్శకుడు ఎస్.వి. రాజేంద్ర సింగ్ బాబు, డాక్టర్ టి. షామ్ భట్, పి. జయచంద్ర రాజులకు గౌరవ డాక్టరేట్లను అందజేశారు. మంత్రి ఎం.సి. సుధాకర్, వీసీ ఎన్.కె. లోక్‌నాథ్ పాల్గొన్నారు.
గవర్నర్ గెహ్లాట్ పిలుపు
ఘనంగా మైసూరు వర్సిటీ స్నాతకోత్సవం
ఆధునిక జ్ఞానానికి విలువల మిళితం


