సహకార సంఘాలు ప్రజా సేవ చేయాలి
రాయచూరు రూరల్: సహకార సంఘాలు ప్రజలకు ఉత్తమ రీతిలో సేవలు అందించాలని రాష్ట్ర సహకార సంఘాల అధ్యక్షుడు విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం జేసీ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులు ప్రామాణికంగా, జవాబుదారితనంతో విధులు నిర్వహించాలన్నారు. సహకార ఎన్నికల్లో పోటీకి సభ్యులు ఆస్తుల వివరాలను ప్రకటించి, సహకార రంగంలో రైతులకు రుణాలు ఇవ్వడం వంటి పనులు చేపట్టి వారికి చేదోడు వాదోడుగా పని చేయాలని సూచించారు. సంఘం అభివృద్ధికి రైతులు, అధికారుల సహకారం ప్రధానమన్నారు. అధికారులు శేఖ్ హసన్, లియాఖత్, కల్లయ్య స్వామి, శశిధర్ పాటిల్, శరణ్, విద్యాసాగర్, గాయత్రి, అశ్విని, మల్లికార్జునలున్నారు.
ఇంటింటికీ గ్రంథాలయం అవసరం
రాయచూరు రూరల్: నేడు ఇంటింటికీ గ్రంథాలయం అవసరమని కన్నడ పుస్తక ప్రాధికార అధ్యక్షురాలు డాక్టర్ మానస పేర్కొన్నారు. బుధవారం కన్నడ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. లక్ష గ్రంథాలయాల పథకం అమలుతో రాష్ట్రంలోని నాలుగు రెవిన్యూ డివిజన్ల పరిధిలో విద్వాంసులను గుర్తించి ప్ర త్యేక అవార్డులను అందజేస్తామన్నారు. గ్రంథాలయాలను అభివృద్ధి పరచడంలో వారు చేసిన సేవలను గుర్తించి అవార్డులను అందిస్తామన్నారు. కార్యక్రమంలో వీర హనుమాన్, రావుత్ రావ్, భగత్ రాజ్ నిజాంకరి, తాయప్ప, బాబు భండారిగల్, రంగణ్ణ పాటిల్, రేఖ, ప్రతిభ, విజయ్ సంతోష్‌లున్నారు.
పాత్రికేయుల సమస్యలపై స్పందిస్తాం
రాయచూరు రూరల్: రాష్ట్రంలో పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందిస్తామని రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు శివానంద తగడూరు, ప్రధాన కార్యదర్శి లోకేష్ పేర్కొన్నారు. గురువారం కలబుర్గిలో అనారోగ్యంతో బాధపడుతున్న ిసీనియర్ పాత్రికేయుడు ఎస్‌బీ జోషిని పరామర్శించి వారు మాట్లాడారు. కరోనా సమయంలో తీసుకున్న నిర్ణయాలను ఉల్లేఖిస్తూ అందరికీ న్యాయం చేస్తామన్నారు. ఆయన వెంట కలబుర్గి వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జిల్లాధ్యక్షుడు యడ్రామి, భవాని సింగ్ ఠాకూర్, దేవేంద్రప్పలున్నారు.
క్రీడల మానసికోల్లాసం వృద్ధి
రాయచూరు రూరల్: మనిషికి క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయని జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఈశ్వర్ కుమార్ పేర్కొన్నారు. గురువారం మహాత్మా గాంధీ క్రీడా మైదానంలో రిపోర్టర్స్ గిల్డ్, అధికారుల సంఘం ఆధ్వర్యంలో సౌహార్ద క్రికెట్ టోర్నీ ఆధ్వర్యంలో పోటీలను ప్రారంభించి మాట్లాడారు. పాత్రికేయులు, జెస్కాం, న్యాయ శాఖలు పోటీల్లో పాల్గొనడం విశేషమన్నారు. పోటీల్లో గెలుపు ఓటమిలను సమానంగా స్వీకరించాలన్నారు. కార్యక్రమంలో ప్రొబేషనరీ అధికారి గురురాజ్ సింగ్ సోలంకి, అదనపు ఎస్పీ కుమారస్వామి, సమాచార హక్కు కమిషనర్ వెంకట సింగ్, అధ్యక్షుడు విజయ్ జాగటగల్, కార్యదర్శి వెంకటేష్, అంబన్న, చెన్నబసవన్నలున్నారు.
క్యాంటర్ వాహనం ఢీకొని ఒకరు మృతి
కోలారు: క్యాంటర్ వాహనం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందిన ఘటన మేడిహాళ గేట్ వద్ద చోటుచేసుకుంది. వివరాలు.. తాలూకాలోని శెట్టిహళ్లి గ్రామానికి చెందిన ఎస్‌ఎం.శ్రీనివాసగౌడ మార్కెట్‌కు ఉల్లిపాయలు తీసుకు వెళ్తున్నారు. రోడ్డు దాటుతున్న సమయంలో వేమగల్ వైపు నుంచి వచ్చిన క్యాంటర్ వాహనం ఢీకొంది. ఈ ఘటనలో గాయపడిన శ్రీనివాసగౌడను ఆస్పత్రికి తరలించినా చికిత్స ఫలించక మృతిచెందాడు. క్యాంటర్ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. వేమగల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
సహకార సంఘాలు ప్రజా సేవ చేయాలి
సహకార సంఘాలు ప్రజా సేవ చేయాలి
సహకార సంఘాలు ప్రజా సేవ చేయాలి


