చందన స్వర్ణమందిర్ ప్రారంభం
సాక్షి,బళ్లారి: నగరంలోని బెంగళూరు రోడ్డులో చందన స్వర్ణమందిర్‌ను వినూత్న రీతిలో ప్రారంభించారు. గురువారం చందన స్వర్ణమందిర్ నిర్వాహకుల ఆధ్వర్యంలో ప్రారంభించిన గోల్డ్‌షాప్‌కు మంచి స్పందన లభించింది. నగర వాసులు పెద్ద సంఖ్యలో చేరడంతో మూడు అంతస్తుల్లో ప్రదర్శించిన బంగారు ఆభరణాల కొనుగోలుకు కిటకిటలాడారు. నూతన షాపు ప్రారంభం సందర్భంగా ప్రత్యేక రాయితీలు కూడా ప్రకటించారు. ఒక గ్రాము బంగారం కొనుగోలు చేసిన వారికి రెండు గ్రాముల వెండి ఉచితంగా ఇవ్వడంతో పాటు వెండితో తయారు చేసిన బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన వారికి 50 శాతం రాయితీ ఇచ్చారు. రూ.లక్ష విలువ చేసే వెండితో తయారు చేసిన బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే రూ.50 వేలు మాత్రమే కట్టించుకున్నామని చందన బ్రదర్స్ డైరెక్టర్లు సంతోష్ రామమోహన్, వెంకట్ గణేష్ తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, మాజీ లోక్‌సభ సభ్యుడు సన్న పక్కీరప్ప, కార్పొరేషన్ ప్రతిపక్ష నాయకుడు మోత్కూరు శ్రీనివాసరెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ మావూరీ శ్రీనివాసరావు, జనరల్ మేనేజర్ వాసు తదితరులు పాల్గొన్నారు.
బెంగళూరు రోడ్డులో వినూత్న రీతిలో వెలసిన బంగారు ఆభరణాల దుకాణం


