ఘనంగా జాతీయ రైతు దినోత్సవం
రాయచూరు రూరల్: రాయచూరు తాలూకా బుడదిన్నిలో గురువారం జాతీయ రైతు దినోత్సవాన్ని నిర్వహించారు. గ్రామంలో భవిష్య భారత్, వీఎస్టీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శశికాంత్ మాట్లాడారు. రైతులకు ప్రభుత్వం జారీ చేసిన పథకాలను అధికారులు ప్రామాణికంగా, జవాబుదారితనంతో వారికి అందేలా విధులు నిర్వహించాలన్నారు. పంటల రక్షణ, లాభ నష్టాలను గురించి వివరించారు. వ్యవసాయ అభివృద్ధి విషయంలో రైతులు, అధికారుల సహకారం ప్రధానమన్నారు. కార్యక్రమంలో అధికారులు వినయ్ రెడ్డి, వనితలున్నారు.
అటల్ బిహారి వాజ్‌పేయి
జన్మదిన వేడుక
రాయచూరు రూరల్: మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్‌పేయి జన్మదినం సందర్భంగా గురువారం అటల్‌జీ చిత్రపటానికి శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ పూలమాల వేశారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో సమావేశాన్నుద్దేశించి ఆయన మాట్లాడారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు జరగాలని కన్న కలలు సాకారం కావాలన్నారు. కార్యక్రమంలో నగర బీజేపీ అధ్యక్షుడు రాఘవేంద్ర, గోవిందు, మాజీ ఎమ్మెల్సీ శంకరప్ప, నేతలు రవీంద్ర, చంద్రశేఖర్, నాగరాజ్‌లున్నారు. అనంతరం రక్తదాన శిబిరం నిర్వహించారు. గ్రామీణ నియోజకవర్గంలో నిర్వహించిన సుశాసన దినోత్సవంలో మాజీ శాసన సభ్యుడు తిప్పరాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా జాతీయ రైతు దినోత్సవం


