కళాత్మకంగా ప్రముఖ చర్చిలు
బనశంకరి: క్రిస్మస్ ఆచరణకు చర్చిలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. భక్తిగీతాలతో చర్చిల్లో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోంది. కాగా క్రిస్మస్ ప్రార్థనలకు రాష్ట్రంలోని అనేక చారిత్రాత్మకమైన చర్చిలు ఖ్యాతిఘడించాయి. బెంగళూరు, మైసూరు, మంగళూరు, ఉడుపిలో వందల సంవత్సరాల నాటి ప్రముఖ చర్చిలు వాస్తుశిల్పి, ధార్మిక మహత్యంతో భక్తులను ఆకట్టుకుంటున్నాయి.
బెంగళూరు నగరంలో
బెంగళూరు నగరంలో క్రిస్మస్ వేడుకలను అత్యంత వైభవంగా ఆచరిస్తారు. ఇక్కడ చర్చిలను విభిన్నరకాల దీపాలతో అలంకరిస్తారు. సెయింట్‌మేరీస్ బసిలికా చర్చి శివాజీనగరలో ఉంది. గోదిక్ శైలి వాస్తుశిల్పానికి పేరుగాంచింది. బెంగళూరు వివేకనగరలోని ఇన్‌ఫ్యాంట్ జీసస్ చర్చి క్రైస్తవులకు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రాస్థలాల్లో ఒకటి. బెంగళూరు ఎంజీ రోడ్డులోని సెయింట్ మార్క్ కెదడ్రల్‌చర్చ్ ఇంగ్లాండ్‌లోని సెయింట్‌పాల్స్ కెదడ్రల్ చర్చి తరహాలో ఉంటుంది. బెంగళూరుసిటీ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉన్న హడ్సన్‌మెమోరియల్‌చర్చ్ అద్భుతమైన వాస్తుశిల్పితో ఆకట్టుకుంటుంది.
మైసూరులో...
సంతపిలోమినా చర్చ్. ఇది మైసూరులో అత్యంత ప్రముఖ చర్చి మాత్రమే కాకుండా భారత్‌లో అతి ఎతైన చర్చిల్లో ఒకటిగా ఉంది. దీనిని నవ–గోదిక్ శైలిలో నిర్మించారు.
మంగళూరు, ఉడుపిలో
మంగళూరులో సంతఅలోసియస్‌చాపెల్ చర్చి గోడలపై అద్భుత చిత్రకళ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ చర్చి ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందింది. హంపనకట్టిలో మిలాగ్రెస్ చర్చ్ ఇది అత్యంత పురాతన చర్చిల్లో ఒకటి. ఉడుపి జిల్లా కార్కళ వద్ద సంతలారెన్స్‌శ్రైన్ చర్చ్ ఉంది. ఇది వార్షిక జాతరకు పేరుగాంచింది.
చెక్కు చెదరని వందల ఏళ్లనాటి చర్చిలు
క్రిస్మస్‌కు ప్రత్యేక ప్రార్థనలతో గుర్తింపు
శెట్టిహళ్లి రోసరి చర్చి
హసనలోని శెట్టిహళ్లి రోసరిచర్చ్‌ను నీటమునిగిపోయే చర్చి అని కూడా పిలుస్తారు. ఇది వర్షాకాలంలో మునిగిపోతుంది. వేసవిలో మాత్రం శెట్టిహళ్లిచర్చిని చూడటం సాధ్యమవుతుంది. ముడిపు, పనేర్‌లోని చర్చిలు చాలా ప్రసిద్ధి చెందాయి.
కళాత్మకంగా ప్రముఖ చర్చిలు


