ముని మనవనిపై అవ్వ కసి?
శిశువు మృతదేహం
బాగేపల్లి: 40 రోజుల పసికందును సొంత అవ్వ హత్య చేసిందని శిశువు తల్లి చేళూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. తాలూకాలోని చేళూరువాసి ఆసిఫా, రాజేశ్ ఒకే కాలేజీలో చదువుతూ మతాంతర ప్రేమపెళ్లిని చేసుకున్నారు. నవంబర్ 12న ఆసిఫాకు మగబిడ్డ పుట్టాడు. దీంతో ఆమె చేళూరు పట్టణం గుంత మోరి వద్ద ఉండే బిరియానీ హోటల్‌లో పనికి చేరి అక్కడే అమ్మమ్మతో ఉంటోంది.
21వ తేదీన..
డిసెంబర్ 21న తాను హోటల్‌లో ఉండగా తన చెల్లి ఫోన్ చేసి పసిబిడ్డ చనిపోయాడని చెప్పిందన్నారు. అదే రోజు సాయంత్రం హోటల్ వెనుక భాగంలో శిశువును పూడ్చిపెట్టినట్లు తెలిపింది. కానీ తాను ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేని అవ్వ.. శిశువుకు ఊపిరి ఆడకుండా చేసి చంపి ఉండొచ్చని ఫిర్యాదులో తెలిపింది. ఈ క్రమంలో పాతిపెట్టిన శిశువు మృతదేహాన్ని తహశీల్దార్ బీకే శ్వేత సమక్షంలో బయటకు తీసి పోస్టుమార్టం కోసం తరలించారు.
మనవరాలు మతాంతర ప్రేమ
వివాహం చేసుకుందని శిశువు హత్య
ముని మనవనిపై అవ్వ కసి?


