ఏసయ్య ఉదయం.. భక్తజన సంబరం
బుధవారం రాత్రి శివాజీనగర సెయింట్ మేరీస్ చర్చిలో పండుగ శోభ
కల్వరి చర్చిలో కేక్ కటింగ్ వేడుక
శివాజీనగర: మానవాళి పాప విమోచనార్థం, లోక కళ్యాణార్థమై భువికి ఏతెంచిన ఏసుక్రీస్తును స్మరిస్తూ క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో క్రిస్మస్‌కు సంసిద్ధమయ్యారు. గురువారం పండుగ కాగా, బుధవారం సాయంత్రం నుంచే అన్ని చర్చిలలో ప్రార్థనలు మొదలయ్యాయి. రంగురంగుల విద్యుద్దీప తోరణాలతో రమణీయంగా చర్చిలు అలరారుతున్నాయి. బాల ఏసు జన్మవృత్తాంత పందిర్లు వెలిశాయి. బెంగళూరు శివాజీనగరలోని ప్రసిద్ధ సెయింట్ మేరీస్ బసిలికా చర్చిలో మత గురువుల ఆధ్వర్యంలో విశేష ప్రార్థనలు జరిగాయి. అర్ధరాత్రి వరకూ కొనసాగాయి.
కల్వరి చర్చిలో సంబరాలు
మరియమ్మనహళ్ళి కర్ణాటక కల్వరి చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలు భక్తులను ఆకట్టుకున్నాయి. చర్చీ పాస్టర్ రెవరెండ్ ఎం.జక్కయ్య ఏసుక్రీస్తు జన్మ విశేషాలను పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఆధారంగా భక్తులకు ఉద్బోధించారు. అంధకారంలో మగ్గుతున్న మానవులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు దైవకుమారుడైన ఏసుక్రీస్తు ప్రభువులవారు జన్మించారని తెలిపారు. ఈ సందర్భంగా భక్తి గీతాలాపన, నృత్య వేడుకలు, కేక్ కటింగ్ నిర్వహించారు.
క్రిస్మస్‌కు సంసిద్ధమైన చర్చిలు
సాయంత్రం నుంచి విశేష ప్రార్థనలు
ఏసయ్య ఉదయం.. భక్తజన సంబరం
ఏసయ్య ఉదయం.. భక్తజన సంబరం
ఏసయ్య ఉదయం.. భక్తజన సంబరం
ఏసయ్య ఉదయం.. భక్తజన సంబరం
ఏసయ్య ఉదయం.. భక్తజన సంబరం
ఏసయ్య ఉదయం.. భక్తజన సంబరం
ఏసయ్య ఉదయం.. భక్తజన సంబరం


