29న జిల్లా వార్షిక రైతు సమావేశం
హొసపేటె: రైతుల దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈనెల 29న ఉదయం 10.30 గంటలకు విజయనగర జిల్లా 3వ వార్షిక రైతు సమావేశం నగరంలోని ఇండోర్ స్టేడియంలో జరుగుతుందని కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సీఏ.గాళెప్ప తెలిపారు. ఆయన స్థానిక ప్రెస్‌హౌస్‌లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతు సమావేశంలో కొట్టూరు స్వామి సంస్థాన మఠానికి చెందిన జగద్గురు కొట్టూరు బసవలింగ మహాస్వామి, ఒప్పత్తేశ్వర మఠానికి చెందిన నిరంజన్ ప్రభుదేశిక మహాస్వామి పాల్గొంటారన్నారు. ఈ సమావేశాన్ని జిల్లా ఇన్‌చార్జి మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ ప్రారంభిస్తారని తెలిపారు. ఎమ్మెల్యే హెచ్‌ఆర్ గవియప్ప, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాసుదేవ మేటి ఊరేగింపును జెండా ఊపి ప్రారంభిస్తారని తెలిపారు.


