విద్యుత్ సాంకేతిక శిక్షణ ప్రారంభం
బళ్లారిఅర్బన్: సండూరు తాలూకా ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో జిందాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొత్త విద్యుత్ శిక్షణ కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. నైపుణ్య అభివృద్ధే ధ్యేయంగా 120 మంది యువకులకు విద్యుత్ వైరింగ్, భద్రతా చర్యలు, పరికరాల వాడకంపై అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను బోధిస్తారు. శిక్షణ తర్వాత ఉద్యోగ కల్పనకు కూడా అన్ని అండదండలను జిందాల్ సంస్థ అందించనుంది. ఎంపీ తుకారాం మాట్లాడుతూ కళాశాల అభివృద్ధికి తాను ఎంతో పాటు పడ్డానన్నారు. తాను చేసిన విజ్ఞప్తి మేరకు జిందాల్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సంగీత నేతృత్వంలో పనులు జరిగాయన్నారు. ఐటీఐ, డిగ్రీ కళాశాల బోధనలను గ్రామీణ విద్యార్థులు వినియోగించుకోవాలన్నారు. ప్రముఖులు పెద్దన్న బీదల, మనిభూషన్ సింగ్, శ్రీకాంత్ హెగ్డే, నాగనగౌడలతో పాటు శ్రేష్ట, ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ సురేష్‌బాబు, ఇతర సిబ్బందితో పాటు గ్రామ వికాస సొసైటీ డైరెక్టర్ సచిన్, 150 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు.


