దైవదర్శనానికి వెళ్లొస్తుండగా..
సాక్షి, బళ్లారి: జిల్లాలోని సిరుగుప్ప తాలూకా తెక్కలకోట సమీపంలోని దేవినగర్ వద్ద జాతీయ రహదారి–150ఏలో దట్టమైన పొగమంచు ఆవహించటంతో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న వంతెన గోడను బలంగా ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందిన ఘటన బుధవారం తెల్లవారుజామున జరిగింది. వివరాలు.. సిరుగుప్పలో నివాసం ఉంటున్న తాలూకాలోని నిట్టూరు గ్రామ పంచాయతీ సభ్యుడు ప్రసాదరావు కుటుంబ సభ్యులతో కలిసి కారులో తమిళనాడులోని దేవాలయానికి దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రసాదరావు(75), విజయ(70), సంధ్య(35) అనే ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, పద్మ(70), బ్రహ్మేశ్వరరావు(45)లకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటన సమాచారం తెలిసిన వెంటనే తెక్కలకోట పోలీసులు హుటాహుటిన చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను కారులో నుంచి వెలికి తీశారు. గాయపడిన వారిని బళ్లారి ట్రామాకేర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఘటనపై తెక్కలకోట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వంతెనకు కారు ఢీకొని ముగ్గురు మృతి
సిరుగుప్ప తాలూకాలో ఘోరం
మృతులంతా ఒకే కుటుంబ సభ్యులు


