పథకం పేరును మార్చడం తగదు
రాయచూరురూరల్: బీజేపీ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చడం తగదని సీసీఐఎం(ఎల్) కార్యదర్శి నాగరాజు అన్నారు. స్థానిక అంబేడ్కర్ సర్కిల్ వద్ద కార్మికులతో కలిసి ఆదివారం ఆందోళన చేపట్టారు. నాగరాజు మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉద్యోగ ఖాత్రి పథకం పేరును మార్చి కేంద్ర సర్కారు పేదల కడుపు కొడుతోందన్నారు. బీజేపీ, అర్‌ఎస్‌ఎస్ పేర్లను నమోదు చేయడానికి ప్రయత్నం చేస్తోందన్నారు. గతంలో ఉన్న పేరును కొనసాగించాలని, పాత విధానం ప్రకారం కేంద్రం 90 శాతం, రాష్ట్ర సర్కారు 10 శాతం నిధులు సమకూర్చేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో అజిజ్‌జాగిర్దార్, కలమంగి, పంపాపతి, హన్మంతరాయ్, జగదీష్, మహేష్, జిలాని, హనీప్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఈడీ పేరుతో అవమానించారు
రాయచూరురూరల్: నేషనల్ హెరాల్డ్ పత్రిక విషయంలో కేసు నమోదు చేయకుండా, ఈడీ పేరుతో కాంగ్రెస్ నేతలను కేంద్ర ప్రభుత్వం అవమానించిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాద్యక్షుడు విఎస్.ఉగ్రప్ప అరోపించారు. కోప్పళ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ రాహుల్‌గాంధీ, సోనియాగాంధీలను బలవంతంగా విచారించడం సరికాదన్నారు. స్వాతంత్య్ర సమరయోధులు కలిసి నడిపిన పత్రికపై అనవసర రాద్ధాంతం చేశారని, న్యాయస్థానంలో కేసు కొట్టి పారేశారని తెలిపారు. గురుధన పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న సంఘటనలు వదలి, కాంగ్రెస్ నేతలపై రాజకీయ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో క్రిష్ణ, జ్యోతి గోండబాల, శైలజ, మంజునాథ పాల్గొన్నారు.
మధుమేహ వ్యాధిపై అవగాహన
రాయచూరు రూరల్: మధుమేహ వ్యాధిపై అవగాహన శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని నవోదయ వైద్యకీయ కళాశాల ట్రస్టీ రాజేంద్రరెడ్డి అన్నారు. కర్నాటక చాప్టర్ రీసర్స్ సొసైటీ ఆఫ్ డయాబెటీస్, నవోదయ వైద్యకీయ, రిమ్స్ సంయుక్తంగా రాయచూరులోని నవోదయ వైద్యకీయ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామాలను దత్తత తీసుకుని వ్యాధి నియంత్రణకు కృషిచేయాలని, సెమినార్లు, వైద్య శిబిరాలను నాలుగు గోడలకు పరిమితం చేయకుండా రోగులకు అవగాహన కల్పించేలా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో బసవరాజ్ పాటిల్, హరిప్రసాద్, రామక్రిష్ణ, మహలింగ, సురేష్ సగరద, ఎస్‌ఎస్.రెడ్డి, శ్రీనివాస్, కార్తిక్, విజయ్‌కుమార్, శ్రీధర్, కల్లప్ప, తదితరులు పాల్గొన్నారు.
హోటళ్లపై దాడులు
రాయచూరు రూరల్: నగరంలోని వివిధ హోటళ్లు, రెస్టారెంట్లపై జిల్లా అధికారి నితీష్, నగరసభ కమిషనర్ జుబీన్ మోహపాత్రో, ఆహార పౌర సరఫారాల శాఖ అధికారి క్రిష్ణ శనివారం సాయంత్రం విస్తృతంగా దాడులు నిర్వహించారు. అక్కడ వండిన ఆహార పదార్థాలను క్షుణ్ణంగా పరిశీలించారు. నిబంధనలు పాటించని హోటల్, రెస్టారెంట్ల యజమానులకు జరిమానా విధించారు.
సీతరాం తండాలో ఎన్నికలు ప్రశాంతం
హొసపేటె: హొసపేటె తాలూకాలోని సీతారాంతాండ పంచాయతీలోని ఎనిమిది వార్డు స్థానాలకు ఆదివారం నిర్వహించిన ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుంచే ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమవగా ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొని ఓటు వేశారు. సీతారాం తాండాలో 4, నల్లపూర్‌లో 3, చిన్నాపూర్ గ్రామంలో ఒక స్థానానికి జరిగే ఈ ఎన్నికల్లో 20 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. విజయనగరం ఎస్పీ ఎస్.జాహ్నవి, డీసీ కవితా ఎస్‌మన్నికేరి పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ మంజునాథ్, డీవైఎస్పీ డాక్టర్ మంజునాథ్ తల్వార్, హంపీ సీఐ రాజేష్ భట్గుర్కి, కమలాపూర్ పీఎస్‌ఐ సంతోష్, తదితరులు పాల్గొన్నారు.
పథకం పేరును మార్చడం తగదు
పథకం పేరును మార్చడం తగదు
పథకం పేరును మార్చడం తగదు
పథకం పేరును మార్చడం తగదు


