ఒడ్డుకు చేరిన కన్నయ్య | - | Sakshi
Sakshi News home page

ఒడ్డుకు చేరిన కన్నయ్య

Dec 24 2025 4:11 AM | Updated on Dec 24 2025 4:11 AM

ఒడ్డు

ఒడ్డుకు చేరిన కన్నయ్య

యశవంతపుర: ఉడుపి జిల్లా మల్పె వద్ద సముద్రంలో నుంచి శ్రీకృష్ణుని విగ్రహం ఒడ్డుకు చేరింది. ఇది దైవమాయ అని భక్తులు సంతోషపడుతున్నారు. వివరాలు.. ఆదివారం ఉడుపి కృష్ణ మఠంలో ఇస్కాన్‌ భక్తులు ఓ వేడుకను నిర్వహించి, అక్కడి నుంచి సాయంత్రం మల్పె సముద్ర తీరానికి వెళ్లారు. ఈ సమయంలో తేలుతూ విగ్రహం ఒడ్డుకు చేరింది. దీనిని గమనించిన భక్తులు విగ్రహాన్ని తీసుకువచ్చి పూజలు చేశారు.

బస్సు డ్రైవర్‌ దాష్టీకం..

తల్లయిన టెన్త్‌ బాలిక

దొడ్డబళ్లాపురం: ప్రైవేటు పాఠశాలకు బస్సులో వెళ్లే బాలికను ఆ బస్సు డ్రైవర్‌ మభ్యపెట్టి లైంగిక దాడులకు పాల్పడ్డాడు. ఫలితంగా గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ అమానుషమైన సంఘటన హాసన్‌ జిల్లాలో జరిగింది. బాలిక చెన్నరాయపట్టణలోని ఒక ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. స్కూల్‌ బస్సు డ్రైవర్‌ రంజిత్‌ 8 నెలలుగా బాలికపై అత్యాచారం చేస్తున్నాడు. బాలిక గర్భం దాల్చి మగ బిడ్డకు జన్మనిచ్చింది. నిందితున్ని అరెస్టు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

బ్రెడ్డులో కొకై న్‌

యశవంతపుర: బ్రెడ్‌లో మత్తు పదార్థం కొకై న్‌ను దాచి తరలిస్తుండగా బెంగళూరు సీసీబీ పోలీసులు నైజీరియా మహిళ ఓ.ఎస్తేర్‌ (29) ను అరెస్ట్‌ చేసి రూ.1.20 కోట్ల విలువైన కొకై న్‌ను పట్టుకున్నారు. వివరాలు.. ఆమె 2024లో ఢిల్లీ వర్శిటీలో చదువు కోసం వచ్చింది. కానీ ముంబైలో మకాం వేసి తెలిసినవారి ద్వారా డ్రగ్స్‌ వ్యాపారం సాగిస్తోంది. ముంబై నుంచి బెంగళూరుకు ప్రైవేట్‌ బస్సులో వస్తోంది. పోలీసులు అనుమానంతో ఆమెను తనిఖీ చేయగా బ్యాగులో బ్రెడ్డు లోపల కొకై న్‌ దొరికింది. అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

చిన్నస్వామిలో మ్యాచ్‌ రద్దు

శివాజీనగర: నగరంలోని చిన్నస్వామి స్టేడియంలో బుధవారం జరగాల్సిన ఢిల్లీ– ఆంధ్రప్రదేశ్‌ మధ్య విజయ్‌ హజారె క్రికెట్‌ టోర్నీ మ్యాచ్‌కు పోలీసులు అనుమతివ్వలేదు. సోమవారం బెంగళూరు కమిషనర్‌ సీమంత్‌ కుమార్‌, గ్రేటర్‌ బెంగళూరు అధికారులు మైదానాన్ని పరిశీలించారు. మ్యాచ్‌కు వీలు లేదని సర్కారుకు నివేదిక ఇచ్చారు. ఈ ఏడాది జూన్‌లో ఆర్‌సీబీ విజయోత్సవాలలో తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోవడం తెలిసిందే. అప్పటినుంచి ఇందులో మ్యాచ్‌లను జరపడం లేదు. గేట్ల విస్తరణ జరపలేదు, రద్దీకి తగిన ఏర్పాట్లు లేవని నివేదికలో పేర్కొన్నారు. ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ ఢిల్లీ టీం నుంచి ఆడాల్సి ఉంది.

రిటైర్డు కెప్టెన్‌ ఆత్మహత్య

దొడ్డబళ్లాపురం: మానసిక రోగంతో బాధపడుతున్న రిటైర్డు సైనికాధికారి రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన హాసన్‌ జిల్లా బేలూరు తాలూకా ఘట్టదహళ్లిలో జరిగింది. జీకే మల్లేశ్‌ (60) సైన్యంలో కెప్టెన్‌గా పనిచేసి రిటైరయ్యారు. మల్లేశ్‌ గత కొన్నాళ్లుగా మానసిక జబ్బుతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నాడు. ఇంట్లో సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఘటనకు ముందు సకలేశపుర పోలీస్‌స్టేషన్‌కి ఫోన్‌ చేసి చనిపోతున్నట్లు చెప్పాడు. వెంటనే వారు హళేబీడు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వెళ్లేటప్పటికి శవమయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

తల్లీకూతుళ్ల అదృశ్యం

శివమొగ్గ: శుభ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇంటి నుంచి వెళ్లిన తల్లీకూతుళ్లు 20 రోజుల నుంచి జాడ లేరు, ఈ ఘటన శివమొగ్గ గ్రామీణ పోలీసు స్టేషన్‌ పరిధిలోని హరిగె సమీపంలోని చిలకాద్రిలో జరిగింది. వివరాలు.. అవినాష్‌ భార్య వీణ(32), కుమార్తె చైతన్య (7)ను తీసుకుని ఈ నెల 3వ తేదీన బంధువుల ఇంట నిశ్చితార్థంకి వెళ్లి ఇంతవరకు ఇంటికి తిరిగి రాలేదు. ఆమె మొబైల్‌ ఫోన్‌ కూడా స్విచాఫ్‌ అయింది. ఆచూకీ తెలిస్తే శివమొగ్గ గ్రామీణ పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు.

ఒడ్డుకు చేరిన కన్నయ్య 1
1/1

ఒడ్డుకు చేరిన కన్నయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement