సర్కారీ ఇంజనీరు వద్ద ఆస్తుల గుట్ట
బనశంకరి: ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టారనే ఆరోపణలతో రాష్ట్రవ్యాప్తంగా పలువురు ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల ఇళ్లు, ఆఫీసులలో లోకాయుక్త దాడులు నిర్వహించింది. బాగల్‌కోటే, విజయపుర, ఉత్తరకన్నడ, రాయచూరు తదితర ప్రాంతాల్లో మంగళవారం ఉదయం నుంచి సోదాలు చేపట్టింది. భారీగా డబ్బులు, బంగారు నగలు, విలువైన సొత్తు, పొలాలు, స్థలాల పత్రాలను కనుగొన్నారు.
ఎక్కడెక్కడ అంటే..
● బాగల్‌కోటే జిల్లా పంచాయతీ ప్లానింగ్ డైరెక్టర్ శ్యామ్‌సుందర్ కాంబ్లేకు చెందిన బాగల్‌కోటే, గదగ జిల్లా నరగుంద ఇళ్లలో, ఆఫీసులో తనిఖీలు చేపట్టారు.
● ఇదే జిల్లాలో బాగేవాడి వ్యవసాయశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మల్లప్ప ఇంటిపై దాడి చేశారు.
● ఉత్తర కన్నడ జిల్లా సిద్దాపురలో పంచాయతీ అధికారి మారుతి యశవంత మాళవి నివాసంలో సోదాలు జరిపారు.
ఏఈఈ లక్ష్మీ నివాసం
రాయచూరు రూరల్: జిల్లాలోని సింధనూరు ఉప విభాగం గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ ఏఈఈ డీ.విజయలక్ష్మీ నివాసం, ఆఫీసు లపై దాడి కలకలం సృష్టించింది. రాయచూరులో ఐడీఎస్‌ంటీ లేఔట్‌లో నాలుగు అంతస్తుల ఇల్లు, పక్కన ఉన్న మరో ఇంట్లో ఫైళ్లను పరిశీస్తున్నారు. చెల్లెలి ఇంటిపైనా దాడి జరిగింది. యాదగిరిలో 30 ఎకరాల భూమి, అక్కడే లేఔట్లు, చంద్రబండ వద్ద 25 ఎకరాల భూమిని గుర్తించారు. రాయచూరు, కొప్పళ, బళ్లారి జిల్లాల్లో అపారమైన ఆస్తులను కనుగొన్నారు. ఆమెకు ఇంకా ఏడాదిన్నర సర్వీసు ఉంది. సుమారు 49 చోట్ల తనిఖీలు చేపట్టడం గమనార్హం. ఆమె హుబ్లీ పర్యటనలో ఉండడంతో వెంటనే రాయచూరుకు తిరిగి రావాలని లోకాయుక్త అధికారులు ఆదేశించారు.
రాష్ట్రంలో లోకాయుక్త మెరుపు దాడులు
పలువురు అధికారుల ఇళ్లలో సోదాలు
సర్కారీ ఇంజనీరు వద్ద ఆస్తుల గుట్ట
సర్కారీ ఇంజనీరు వద్ద ఆస్తుల గుట్ట


