బెంగళూరుకు సాయం చేయాలి
బనశంకరి: బెంగళూరులో మెట్రో రైలు పథకం మూడో స్టేజ్ కు ఆమోదం, ఆర్‌ఆర్‌టీఎస్ పథకానికి సాయం, మిట్టగానహళ్లి చెరువు వద్ద చెత్త యార్డుకు అనుమతి తో పాటు బెంగళూరు అభివృద్ధికి సాయం చేయాలని కేంద్ర నగరాభివృద్ధి మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ను డీసీఎం శివకుమార్ కోరారు. ఢిల్లీలో ఆయనతో సమావేశమయ్యారు. దేశంలో బెంగళూరు మహా నగరమని, మీ వద్ద పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలను పరిష్కరించాలని డీకే కోరారు. మెట్రో రైలు రెండో దశ పథకం ఖర్చు రూ.26,405 కోట్ల నుంచి రూ.40,425 కోట్లకు పెరిగిందని, ప్రతిపాదనలను మీకు పంపించామని, ఆమోదించాలని తెలిపారు. మెట్రో మూడో స్టేజ్ పథకం సర్జాపుర నుంచి హెబ్బాళ వరకు 36.59 కిలోమీటర్లు, 28 స్టేషన్లతో ఉంటుంది, ఇందుకు రూ.28,405 కోట్ల ఖర్చును అంచనా వేసి కేంద్రం ఆమోదానికి పంపించామని, త్వరగా ఆమోదం తెలియజేయాలని కోరారు.
కేంద్రమంత్రి ఖట్టర్‌కు డీసీఎం వినతి


