సిద్దుకు మద్దతుగా, డీకేకి ముళ్లుగా..
శివాజీనగర: కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేఎన్ రాజణ్ణ, పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీకి మరో లేఖ రాశారు. ఓట్ చోరీ అభియానపై తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలతోనే ఆయనను గతంలో మంత్రి పదవి నుంచి తీసేయడం తెలిసిందే. ఇప్పటికే నాలుగు లేఖలను రాసిన రాజణ్ణ, రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలతో పార్టీకి నష్టం జరుగుతోందని తాజా లేఖలో పేర్కొన్నారు. సిద్దరామయ్యను సీఎం స్థానం నుంచి తొలగిస్తే మరింత నష్టం జరుగుతుందని ఆయనకు మద్దతుగా నిలబడడం గమనార్హం. ఓటర్ల జాబితా విషయంలో కేపీసీసి నియమించిన బీఎల్‌ఏలు సక్రమంగా పనిచేయలేదంటూ కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌పైనా విమర్శలు గుప్పించారు. లేఖలో డీకేకి వ్యతిరేకంగా పలు అంశాలను రాశారు. వివరంగా చర్చించేందుకు భేటీకి సమయం ఇవ్వాలని రాహుల్‌ను కోరారు.
రాహుల్‌గాంధీకి రాజణ్ణ మరో లేఖ


