వ్యక్తి హత్య కేసులో నిందితుల అరెస్ట్
రాయచూరు రూరల్: తన భార్య, తన తల్లితో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడన్న కోపంతో తండ్రీకొడుకులు కలిసి ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటనలో ఆరు నెలల అనంతరం నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన పూర్వాపరాలు.. విజయపుర జిల్లా సింధగి తాలూకా బెన్నట్టి గ్రామంలో మహదేవప్ప(35) అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన భూస్వామి సిద్దనగౌడ భార్య మల్లమ్మ(40)తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సిద్దనగౌడ(50), అతని కుమారుడు అప్పుగౌడ(25) కలిసి మహదేవప్పను మట్టు పెట్టి తమకేమీ తెలియనట్లుగా వ్యవహరించారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేపట్టిన విజయపుర పోలీసులు ఎట్టకేలకు ఆరు నెలల తర్వాత నిందితులైన తండ్రీకొడుకులను అరెస్ట్ చేసినట్లు ఆ జిల్లా ఎస్పీ తెలిపారు.
వ్యక్తి హత్య కేసులో నిందితుల అరెస్ట్
వ్యక్తి హత్య కేసులో నిందితుల అరెస్ట్


