
నులి చందయ్య వచనాలు ఆచరణీయం
రాయచూరు రూరల్: శరణుల్లో ఒకరైన కాయకయోగి నులిచందయ్య వచనాలు సమాజానికి దారిదీపాలని రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజ్ అన్నారు. శనివారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగ మందిరంలో జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ.నగర సభ, సాంఘిక సంక్షేమ శాఖ, కన్నడ సంస్కృతి శాఖల అధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన నులి చందయ్య జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నులి చందయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి మాట్లాడారు. నులి చందయ్య బసవన్న, ఇతర శరణుల బోధనలను అనుసరించారన్నారు. ప్రతి ఒక్కరూ కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలని తన వచనాల ద్వారా తెలియజేశారన్నారు. జాతి, కుల, వర్గ, వర్ణ వ్యవస్థ నిర్మూలనకు అప్పట్లోనే శ్రమించారన్నారు. నులి చందయ్య వచనాలను ప్రతి ఒక్కరూ ఆచరించి జీవితాలను చక్కబెట్టుకోవాలన్నారు. తహసీల్దార్ సురేష్ వర్మ, సమాజం నేతలు నరసింహులు, మల్లికార్జున, ఈరణ్ణ, మాల భజంత్రి, నగరసభ ఉపాధ్యక్షుడు సాజిద్ సమీర్, అమరే గౌడ, రుద్రప్ప, శివ మూర్తి, శ్రీనివాస రెడ్డి, లక్ష్మిరెడ్డి పాల్గొన్నారు.