
ప్రామాణికంగా న్యాయ సేవలు అందించాలి
రాయచూరు రూరల్: కక్షిదారులకు ప్రామాణికతతో న్యాయ సేవలు అందించాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యం.జి.ఎస్.కమాల్ పిలుపునిచ్చారు. మాన్విలో నూతనంగా ఏర్పాటు చేసిన న్యాయవాదుల భవనాన్ని న్యాయమూర్తి శనివారం ప్రారంభించి మాట్లాడారు. న్యాయవాదులు చొరవ చూపితే ఎక్కువ కేసులు పరిష్కారం అవుతాయన్నారు. తమను నమ్మి వచ్చిన కక్షిదారులకు న్యాయం చేయాలన్నారు. కేసులను రాజీమార్గంలో పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజ్, జిల్లా ప్రధాన న్యాయమూర్తులు దయానంద బేలూరు, స్వాతిక్ పాల్గొన్నారు.