
కొనసాగుతున్న ఆరాధనోత్సవాలు
రాయచూరు రూరల్ : మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వాముల మఠంలో స్వామివారి ఆరాధనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. పూర్వారాధనలో భాగంగా మంత్రాలయం పీఠాధిపతి సుబుదేంద్రతీర్థ శ్రీ పాదంగల్ రాఘవేంద్రస్వామి బృందావనానికి ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం తమిళనాడులోని రంగనాథ ఆలయం నుంచి తెచ్చిన పట్టువస్త్రాలను గురురాఘవులకు సమర్పించారు. రాఘవేంద్ర మూలవిరాట్‌కు ఊంజల్ సేవలు నిర్వహించారు. స్వామివారికి తెప్పోత్సవం నిర్వహించారు. రాష్ట్ర చిన్న నీటి పారుదుల శాఖ మంత్రి బోసురాజ్ పాల్గొన్నారు.
బళ్లారిలో...
సాక్షి బళ్లారి: బళ్లారి బళానగరంలోని శ్రీసత్యనారాయణపేటలో వెలిసిన శ్రీగురు రాఘవేంద్రస్వామి ఆలయంలో మంత్రాలయం శ్రీగురు రాఘవేంద్ర 354వ ఆరాధన మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆదివారం ఆలయ కమిటి ఆధ్వర్యంలో స్వామివారి బృందావనానికి పంచామృత అభిషేకం, పూలాభిషేకం, కనకాభిషేకం తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ముఖ ద్వారం నుంచి లోపల వరకు ప్రత్యేక పూలతో అలంకరణ చేయడంతో ఆలయం శోభాయమానంగా రూపుదిద్దుకుంది. ఆలయం లోపల స్వామి సన్నిధికి ఏర్పాటు చేసిన ప్రత్యేక పూల అలంకరణలు భక్తులను ఎంతగానో ఆకట్టుకోంది.

కొనసాగుతున్న ఆరాధనోత్సవాలు

కొనసాగుతున్న ఆరాధనోత్సవాలు