
రాయచూరులో భారీ వర్షం
రాయచూరురల్: రాయచూరు నగరంలో వర్షం దంచి కొట్టింది. శుక్రవారం పగలంతా విపరీతమైన ఎండలు కాశాయి. రాత్రి సమయంలో ప్రారంభమైన వర్షం గంటలపాటు ఎడతెరిపి లేకుండా కురిసింది. దీంతో రోడ్లు వంకలను తలపించాయి. మోకాలి లోతు నీరు ప్రవహించింది. హైదరాబాద్ గోశాల రహదారి, మంత్రాయం రహదారి, బసవన బావి సర్కిల్ జలమయం అయ్యాయి మూన్నూరు వాడి, గాంధీ చౌక్, మహవీరచౌక్ ప్రాంతాల్లో నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చొరబడింది. దీంతో పేదలు జాగారం చేయాల్సి వచ్చింది.

రాయచూరులో భారీ వర్షం