
తుంగభద్ర బ్యాక్ వాటర్‌లో మొసలి ప్రత్యక్షం
హొసపేటె: తుంగభద్ర జలాశయం బ్యాక్ వాటర్ ఒడ్డున శనివారం మొసలి విశ్రాంతి తీసుకుంటున్న దృశ్యాన్ని చూసి పర్యాటకులు ఆశ్చర్యపోయారు. యువకుల బృందం ధైర్యం చేసి మొసలిని తోక పట్టుకుని లాగి నీటిలో సురక్షితంగా వదిలివెళ్లారు. ప్రస్తుతం తుంగభద్ర జలాశయంలో భారీగా వరద ప్రవహం పోటెత్తుతుండటంతో తీర ప్రాంతాల్లో మొసలి సంచారం అధికమైంది. తీర ప్రాంతాల్లో పర్యటించే పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
ధర్మడ గుడ్డ వద్ద చిరుత సంచారం
హొసపేటె: విజయనగర జిల్లా హొసపేటె తాలూకా ధర్మడగుడ్డ వద్ద చిరుత సంచరిస్తోంది. దీంతో భక్తులు, గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. కొండపైన కొంతకాలంగా చిరుత తిరుగుతున్న దృశ్యాన్ని స్థానిక యువకులు ఇప్పటికే తమ మొబైల్ ఫోన్లలో బంధించారు. తాజాగా కొండ దిగువన చిరుత సంచరిస్తుండటాన్ని కొందరు గమనించి ఆ పరిసరాలనుంచి వెనక్కు వచ్చారు. బసవన్‌దుర్గ, నాగేనహళ్లితో సహా అనేక గ్రామాల భక్తులు ధర్మడగుడ్డ వద్ద ఉన్న ఆలయానికి రావడం సర్వసాధారణం. ప్రస్తుతం చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించడంతో స్థానికులు, భక్తులు భయాందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి చిరుతను బంధించాలని కోరుతున్నారు.
అన్నా చెల్లెలి బంధానికి ప్రతీక రాఖీ పండుగ
రాయచూరురూరల్: రాఖీ పండుగ అన్నా చెల్లెలి బంధానికి ప్రతీక అని కిల్లే బృహన్మఠం మఠాధిపతి శాంతమల్ల శివాచార్యలు అన్నారు. శనివారం రాఖీ పండుగను పురస్కరించుకొని ప్రజాపిత బ్రహ్మ కుమారీ ఈశ్వరీ విశ్వ విద్యాలయం సంచాలకురాలు స్మిత మఠానికి వచ్చి స్వామీజీకి రాఖీలు కట్టారు. రాఖీ పండుగ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుందన్నారు.
విద్యతోనే సముదాయ అభివృద్ధి
రాయచూరు రూరల్: విద్యకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని సోమవారి పేట మఠాధిపతి అభినవ రాచోటి శివాచార్యలు అన్నారు. మూన్నూరు కాపు సమాజం కళ్యాణ మంటపంలో పది, ఇంటర్, డిగ్రీలో ప్రతిభ చాటిన ఆ సముదాయం విద్యార్థులకు శనివారం ప్రతిభాపురస్కారాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వామీజీ మాట్లాడుతూ విద్యతోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. బాల్య వివాహాలు సమాజ అభివృద్ధికి ఆటంకమని, వాటిని అరికట్టి పిల్లలను పాఠశాలలకు పంపి విద్యావంతులను చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ అరోగ్య, పరిసరాల శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నగరసభ ఉపాధ్యక్షుడు సాజిద్ సమీర్, మాజీ శాసనసభ్యుడు పాపారెడ్డి, నరసా రెడ్డి, తిమ్మారెడ్డి, శ్రీనివాస రెడ్డి, క్రిష్ణమూర్తి, లక్ష్మిరెడ్డి, శంకర్ రెడ్డి పాల్గొన్నారు.

తుంగభద్ర బ్యాక్ వాటర్‌లో మొసలి ప్రత్యక్షం

తుంగభద్ర బ్యాక్ వాటర్‌లో మొసలి ప్రత్యక్షం

తుంగభద్ర బ్యాక్ వాటర్‌లో మొసలి ప్రత్యక్షం