
భిక్షాటనతో ఆలయానికి విరాళం
రాయచూరు రూరల్: ఆలయ జీర్ణోద్ధరణకు ఓ వృద్ధురాలు భిక్షాటన చేపట్టి భారీ మొత్తంలో విరాళం సమర్పించింది. రాయచూరు తాలూకా బిజినగేరకు చెందిన మహిళ చిన్న షెడ్డులో నివాసం ఉంటోంది. 40 సంవత్సరాలుగా భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. ఆమెకు తెలుగు భాష తప్ప ఇతర భాషలు తెలియవు. భిక్షాటన ద్వారా వచ్చిన మొత్తాన్ని గోనె సంచిలో దాచి ఉంచేది. గ్రామంలో ఆంజనేయస్వామి ఆలయ జీర్ణోద్ధరణ జరుగుతుండగా విరాళం ఇచ్చేందుకు ఆ వృద్ధురాలు ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని ఆలయ కార్యదర్శి బసవరాజ యాదవ్‌కు తెలియజేసి తాను నివాసం ఉంటున్న షెడ్డుకు తీసుకొని వచ్చింది. గోనె సంచిలో ఉన్న చిల్లర డబ్బును అందజేసింది. ఆ మొత్తాన్ని లెక్కించగా లక్షా83వేల రూపాయలుగా తేలింది. ఇందులో కొన్ని నోట్లు చెల్లనవిగా ఉన్నాయి.
వృద్ధురాలి దాతృత్వం

భిక్షాటనతో ఆలయానికి విరాళం

భిక్షాటనతో ఆలయానికి విరాళం

భిక్షాటనతో ఆలయానికి విరాళం